లాంచ్ కి ముందు గీక్ బెంచ్ పై కనిపించిన Moto Edge 30 Ultra

హైలైట్స్:

  • గీక్ బెంచ్ వెబ్ సైట్ లిస్టింగ్ లో కనిపించిన మోటో ఎడ్జ్ 30 అల్ట్రా (ఎక్స్30 ప్రో)
  • త్వరలో చైనాలో తర్వాత ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ కానున్న మోటో ఎడ్జ్ 30 అల్ట్రా
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్, 12జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో వస్తున్న మోటో ఎడ్జ్30 అల్ట్రా

మోటోరోలా నుంచి వస్తున్న ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ మోటో ఎడ్జ్30 అల్ట్రా లాంచ్ కి ముందు గీక్ బెంచ్ అనే బెంచ్ మార్కింగ్ వెబ్ సైట్ పై కనిపించింది. స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ తో వస్తున్న ఈ ఫోన్ బెంచ్ మార్క్ స్కోర్స్, గీక్ బెంచ్ వెబ్ సైట్ లో కనిపించాయి. ఆగస్టు 2 న మోటో ఎక్స్30 ప్రో అనే పేరుతో చైనాలో ఈ డివైజ్ లాంచ్ అవుతోంది. ఇక గ్లోబల్ మార్కెట్స్ లో ఈ ఫోన్ మోటో ఎడ్జ్ 30 అల్ట్రా అని పిలవబడనుంది.

గీక్ బెంచ్ పై దర్శనమిచ్చిన Moto Edge 30 Ultra

గీక్ బెంచ్ యొక్క బెంచ్ మార్కింగ్ టెస్ట్ లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ కలిగిన మోటో ఎడ్జ్30 అల్ట్రా చెప్పుకోదగిన స్కోర్ నే నమోదు చేసింది. సింగిల్ స్కోర్ టెస్ట్ లో మోటో ఎడ్జ్30 అల్ట్రా 1,252 పాయింట్లను సాధించగా, మల్టీ-కోర్ టెస్ట్ లో 3,972 పాయంట్లను సాధించింది.

Moto Edge 30 Ultra స్పెసిఫికేషన్స్

మోటో ఎడ్జ్ 30 అల్ట్రా 200 ఎంపి కెమెరా ప్రధాన ఫీచర్ గా వస్తోంది. దీనికి తోడు 50ఎంపి అల్ట్రావైడ్, 12ఎంపి పొట్రెయిట్ కెమెరాలు ఉంటాయి. ఇక డివైజ్ లో ముందువైపున 60ఎంపి కెమెరా ఉండనున్నట్లు సమాచారం. మోటో ఎడ్జ్ 30 అల్ట్రా స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ పై పని చేస్తుంది. ఇందులో 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ ఉండనున్నాయి.

మోటో ఎడ్జ్ 30 అల్ట్రా లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఇది 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. మోటో ఎడ్జ్ 30 అల్ట్రా 50 వాట్ ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది.

చైనాలో మోటో ఎక్స్ 30 ప్రో గా లాంచ్ అవుతోన్న మోటో ఎడ్జ్ 30 అల్ట్రా 2022, ఆగస్టు 2 న లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. తర్వాత ఇదే డివైజ్ ఎడ్జ్ 30 అల్ట్రా అనే పేరుతో గ్లోబల్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. మోటో ఎడ్జ్ 30 అల్ట్రా ఫోన్ ఇటీవలె బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్ సైట్ లో క్లియరెన్స్ కూడా పొందింది. దీంతో త్వరలోనే భారత్ లో ఫోన్ లాంచ్ కానుందని స్పష్టమైంది.

భారత్ లో ఈ ఫోన్ ఎప్పుడెప్పుడు లాంచ్ అవుతుందా అని ఔత్సాహికులు వేచి చూస్తున్నారు. భారత మార్కెట్ లోకి ఎడ్జ్ 30 అల్ట్రా ప్రవేశించాక, కచ్చితంగా ఇతర ఫ్లాగ్ షిప్స్ కి మాంచి పోటీ ఇస్తుందనడంలో సందేహం లేదు. ఫోన్ స్పెసిఫికేషన్స్ బట్టి పేపర్ పై బలంగా కనిపిస్తోంది. కానీ, లాంచ్ తర్వాత యూజర్ పెర్ఫామెన్స్ తో ఫోన్ సక్సెస్ నిర్ణయించబడుతుంది. 60 ఎంపి ఫ్రంట్ కెమెరా వ్లాగింగ్ చేసే వారికి బాగా ఉపయోగపడనుంది. అలాగే, 200ఎంపి కెమెరాతో వస్తున్న తొలి ఫోన్ ఇదే కావడం విశేషం. ఇక స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ ఉండటంతో పెర్ఫామెన్స్ కి తిరుగుండదు. ప్రధానంగా ఈ మూడు ఫీచర్లు ఫోన్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.