Home News 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50ఎంపి కెమెరాతో ఈ నెలలో భారత్‌లో లాంచ్ కానున్న Motorola Edge 40

68 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50ఎంపి కెమెరాతో ఈ నెలలో భారత్‌లో లాంచ్ కానున్న Motorola Edge 40

Highlights
  • డైమెన్సిటీ 8020 చిప్‌తో రానున్న Motorola Edge 40
  • భారత్ కంటే ముందే గ్లోబల్ మార్కెట్‌లోకి వచ్చిన డివైజ్
  • భారత్ లో Motorola Edge 40 ధర రూ.40,000 గా ఉండే అవకాశం

Motorola Edge 40 స్మార్ట్ ఫోన్ కొన్ని రోజుల క్రితం గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఇప్పుడు ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అయ్యేందుకు సిద్ధమైంది. టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ప్రకారం, ఈ ప్రీమియమ్-మిడ్ రేంజ్ ఫోన్ ఈ నెలలో లాంచ్ కానుందని తెలుస్తోంది. Motorola Edge 40 డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8020 చిప్సెట్, పీఓఎల్ఈడీ డిస్ప్లే మరియు 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రానుందని సమాచారం.

Motorola Edge 40 ధర (అంచనా)

Motorola Edge 40 స్మార్ట్ ఫోన్ ధర గ్లోబల్ మార్కెట్ లో 599.99 యూరోలు (సుమారు రూ.54,200) గా ఉంది. ఇక భారత్ లో ఈ డివైజ్ ధర దాదాపు రూ.40,000 వద్ద ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Motorola Edge 40 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

Motorola Edge 40 స్మార్ట్ ఫోన్ లో 6.55-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పీఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, హెచ్డీఆర్10+, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.

ప్రాసెసర్

Motorola Edge 40 స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8020 చిప్సెట్, మాలి-జీ77 ఎంసీ9 జీపీయూ ఉంటాయి.

ర్యామ్, స్టోరేజీ

Motorola Edge 40 స్మార్ట్ ఫోన్ లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ మరియు 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి.

ఓఎస్, బ్యాటరీ

Motorola Edge 40 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండనున్నాయి. 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో ఉంది. అంతేకాదు, 5 వాట్ రివర్స్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

కనెక్టివిటీ

Motorola Edge 40 డివైజ్ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

కెమెరా విభాగం

Motorola Edge 40 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ ఓఐఎస్ కెమెరా, 13 ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఇందులో 32ఎంపి కెమెరా ఉంటుంది.