ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో Edge 40 Neo డివైజ్ ని లాంచ్ చేయబోతోంది. సెప్టెంబర్ 14 న ఈ ఫోన్ లాంచ్ కానున్నట్లు సమాచారం. తాజాగా Motorola Edge 40 Neo డివైజ్ ధర లీకైంది. అలాగే ర్యామ్, మెమొరీ వేరియంట్స్ కూడా రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Motorola Edge 40 Neo డివైజ్ యొక్క ధర, ర్యామ్, మెమొరీ వేరియంట్స్ వివరాలు తెలుసుకుందాం పదండి.
Motorola Edge 40 Neo ధర (లీక్)
Motorola Edge 40 Neo డివైజ్ యురోపియన్ మార్కెట్ ధర లీకైంది. టిప్‌స్టర్ పారస్ గుగ్లానికి యురోపియన్ రిటైల్ స్టోర్ నుంచి స్క్రీన్ షాట్ వచ్చింది. ఈ స్క్రీన్‌షాట్ లో మెమొరీ వేరియంట్స్, ధర ఉన్నాయి. లీకైన ఫోటోని బట్టి, Motorola Edge 40 Neo డివైజ్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వేరియంట్ ధర 338.99 యూరోలుగా ఉంది. అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ.30,200. అయితే, లాంచ్ తర్వాతే అసలైన ధర ఎంటో తెలుస్తుంది.
Motorola Edge 40 Neo లాంచ్ వివరాలు
సెప్టెంబర్ 14 న Motorola Edge 40 Neo డివైజ్ లాంచ్ అవుతోంది. తొలుత రొమేనియాలో లాంచ్ అయ్యాక, ఇతర దేశాల్లోకి ప్రవేశించనుంది. కంపెనీ తన కొత్త ఫోన్ ని ‘make a splash’ అనే ట్యాగ్‌లైన్ తో ప్రమోట్ చేస్తోంది. అంటే ఇది ఐపీ68 రేటింగ్ ని సూచిస్తోంది. ఇప్పటికే ఎడ్జ్ సిరీస్ లో Motorola Edge 40, Motorola Edge 40 Pro లాంచ్ అయ్యాయి.
Motorola Edge 40 Neo స్పెసిఫికేషన్స్ (లీక్)
- స్క్రీన్: Moto Edge 40 Neo 5G లో 6.55-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పీఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, సన్నని బెజెల్స్ ఉంటాయి.
- ప్రాసెసర్: Moto Edge 40 Neo 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 1050 చిప్ ఉంటుంది.
- ర్యామ్, స్టోరేజీ: Moto Edge 40 Neo 5G 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి.
- ఓఎస్: Moto Edge 40 Neo 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
- కెమెరా: Moto Edge 40 Neo 5G లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 13ఎంపి సెకండరీ లెన్స్, 32ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటాయి.
- బ్యాటరీ: Moto Edge 40 Neo 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ: Moto Edge 40 Neo 5G లో 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ ఉంటాయి.
- ఇతర ఫీచర్లు: Moto Edge 40 Neo 5G లో ఐపీ68 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.
- కలర్స్: Moto Edge 40 Neo 5G డివైజ్ లైట్ గ్రీన్, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
