ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నేడు భారతీయ మార్కెట్ లో Motorola Edge 50 Fusion డివైజ్ ని లాంచ్ చేసింది. ఎడ్జ్ 50 ఫ్యూజన్ డివైజ్ లో ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ ఉంది. ఇంకా ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 12జిబి ర్యామ్, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 50ఎంపి కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. ఓసారి డివైజ్ ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Motorola Edge 50 Fusion ధర, లభ్యత
Motorola Edge 50 Fusion స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో 2 స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Motorola Edge 50 Fusion 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.22,999 గా నిర్ణయించారు. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999 గా ఉంది.
లాంచ్ ఆఫర్ లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులపై రూ.2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తున్నారు. దీంతో ఫోన్ రూ.20,999 కే లభించనుంది. టాప్ వేరియంట్ రూ.22,999 కే లభిస్తుంది.
మే 22 నుంచి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా వెబ్‌సైట్ మరియు రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా Motorola Edge 50 Fusion సేల్‌కి వస్తోంది.
Motorola Edge 50 Fusion డివైజ్ ఫారెస్ట్ బ్లూ, మార్ష్‌మాలో బ్లూ మరియు హాట్ పింక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Motorola Edge 50 Fusion స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Motorola Edge 50 Fusion లో 6.7-ఇంచ్ 3డీ కర్వ్డ్ పీఓఎల్ఈడీ స్క్రీన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఉన్నాయి.
ప్రాసెసర్: Motorola Edge 50 Fusion లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ వాడారు. ఈ చిప్ యొక్క హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4GHz.
ర్యామ్, స్టోరేజీ: Motorola Edge 50 Fusion డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
కెమెరా: Motorola Edge 50 Fusion లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీఐఏ 700సీ ఓఐఎస్ మెయిన్ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. వైడ్ యాంగిల్ లెన్స్ 4ఎక్స్ మ్యాక్రో షాట్స్ కూడా తీయగలదు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
బ్యాటరీ: Motorola Edge 50 Fusion లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
ఓఎస్: Motorola Edge 50 Fusion డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హలో యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ 3 ఏళ్ళ పాటు ఓఎస్ అప్డేట్స్, 4 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ పొందుతుంది.
ఇతర ఫీచర్లు: Motorola Edge 50 Fusion లో ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, డ్యూయల్ సిమ్, 5జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
