ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో ఎడ్జ్-50 సిరీస్ లో మరో ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సిరీస్ లో 3 మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఇప్పడు Motorola Edge 50 భారత్ లో లాంచ్ కాబోతోంది. తాజాగా మోటోరోలా సంస్థ లాంచ్ తేదీని ప్రకటించింది. ఆగస్టు నెలలో ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఓసారి లాంచ్ వివరాలు మరియు స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం.
Motorola Edge 50 ఇండియా లాంచ్ తేదీ
Motorola Edge 50 స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో ఆగస్టు 1వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతోంది.
Motorola Edge 50 స్మార్ట్‌ఫోన్ యొక్క ఫీచర్లు ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ ద్వారా రివీల్ అయ్యాయి.
Motorola Edge 50 ఫోన్ ప్రత్యేకత ఏంటంటే, MIL-810H మిలిటరీ గ్రేడ్ తో వస్తోన్న ప్రపంచపు మొట్టమొదటి సన్నని ఫోన్ ఇదే.
మిలిటరీ గ్రేడ్ స్ట్రెంగ్త్ వల్లన, ఈ ఫోన్ అత్యల్ప మరియు అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకుని నిలవగలదు. అలాగే ఈ ఫోన్ ఒత్తిడి, షాక్, వైబ్రేషన్, దుమ్ము, పొగమంచు వంటి వాటి నుంచి రక్షణ పొందుతుంది. ఐపీ68 రేటింగ్ తో వస్తోన్న ఈ ఫోన్ నీరు, దుమ్మును ఎదుర్కొని నిలవగలదు.
Motorola Edge 50 స్మార్ట్‌ఫోన్ జంగిల్ గ్రీన్ మరియు పేంటోన్ పీచ్ ఫడ్జ్ కలర్స్ లో లభిస్తుంది. ఈ రెండు కలర్ వేరియంట్స్ వీగన్ లెదర్ ఫినిష్ తో వస్తున్నాయి. మరోవైపు, కోలా గ్రే కలర్ వీగన్ సూడో ఫినిష్ తో వస్తోంది.
Motorola Edge 50 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Motorola Edge 50 లో 6.67-ఇంచ్ పీఓఎల్ఈడీ స్క్రీన్, 1900 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
ప్రాసెసర్: Motorola Edge 50 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 యాక్సలరేటెడ్ ఎడిషన్ చిప్ వాడారు. ఇది 4 ఎన్ఎమ్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.
ర్యామ్, స్టోరేజీ: Motorola Edge 50 డివైజ్ 256జిబి స్టోరేజీ, ర్యామ్ బూస్టర్ ఫీచర్ తో వస్తోంది.
కెమెరా: Motorola Edge 50 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-700సీ మెయిన్ కెమెరా, 13ఎంపి 120-డిగ్రీ అల్ట్రావైడ్ లెన్స్, 10ఎంపి టెలీఫోటో 30ఎక్స్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
బ్యాటరీ: Motorola Edge 50 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 68 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది.
సాఫ్ట్‌వేర్: Motorola Edge 50 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అవుతుంది. 3 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్, 4 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.
కనెక్టివిటీ: Motorola Edge 50 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి.
