ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola తన ఎడ్జ్ సిరీస్ లో మరొక ఫోన్ తో యూజర్ల ముందుకు రాబోతోంది. Motorola Edge 50 Neo పేరుతో వస్తోన్న ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీని తాజాగా కంపెనీ ఖరారు చేసింది. సెప్టెంబర్ 16వ తేదీన ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో విడుదల కానుంది. ఫ్లిప్‌కార్ట్ లో ఇప్పటికే ఎడ్జ్ 50 నియో యొక్క మైక్రోసైట్ దర్శనమిస్తోంది. ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Motorola Edge 50 Neo ఇండియా లాంచ్ తేదీ వివరాలు
Motorola Edge 50 Neo స్మార్ట్‌ఫోన్ భారత్ లో సెప్టెంబర్ 16వ తేదీన లాంచ్ అవుతోంది. దీనికి సంబంధించిన టీజర్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో కనిపిస్తోంది.
మోటోరోలా ఎడ్జ్ 50 నియో వీగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్ తో వస్తోంది. ఇంకా ఈ ఫోన్ ఐపీ68 MIL810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫైడ్ రేటంగ్ తో రానుండటం విశేషం.
Motorola Edge 50 Neo స్మార్ట్‌ఫోన్ నాటికల్ బ్లూ, లాటే, గ్రిసైల్ మరియు పొయిన్సియానా కలర్ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది.
Motorola Edge 50 Neo స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Motorola Edge 50 Neo స్మార్ట్‌ఫోన్ లో 6.4-ఇంచ్ సూపర్ హెచ్డీ ఎల్టీపీవో స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 100 పర్సెంట్ డీసీఐ పీ3 కలర్ గ్యామట్, 10-బిట్ కలర్స్, పంచ్ హోల్ కటౌట్, మినిమల్ బెజెల్స్ ఉంటాయి.
చిప్సెట్: Motorola Edge 50 Neo లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ ఉంటుంది.
ర్యామ్, స్టోరేజీ: Motorola Edge 50 Neo డివైజ్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది.
కెమెరా: Motorola Edge 50 Neo లో 50ఎంపి అల్ట్రా పిక్సెట్ సోని ఎల్‌వైటీఐఏ 700సీ మెయిన్ కెమెరా, 10ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి 4కే రికార్డింగ్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
బ్యాటరీ, చార్జింగ్: Motorola Edge 50 Neo లో పవర్ బ్యాకప్ కోసం 4310 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ 68 వాట్ టర్బోపవర్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
సాఫ్ట్‌వేర్: Motorola Edge 50 Neo డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ కి 5 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్, 5 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్ లభిస్తాయి.
ఇతర ఫీచర్లు: Motorola Edge 50 Neo లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.3, ఏఐ స్టైల్ సింక్, ఏఐ మ్యాజిక్ కాన్వాస్ ఉంటాయి.
