ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ Motorola ఎడ్జ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Motorola Edge 50 Pro 5G పేరుతో వస్తోన్న ఈ డివైజ్ ఏప్రిల్ 3వ తేదీన లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ 6.7-ఇంచ్ పంచ్-హోల్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 3డీ కర్వ్డ్ స్క్రీన్, హెచ్డీఆర్10+, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వంటి ఫీచర్లతో వస్తోంది. ఈ ఆర్టికల్ లో మనం Motorola Edge 50 Pro 5G లో ఉన్న 5 ఉత్తమమైన ఫీచర్లేవో తెలుసుకుందాం.
Motorola Edge 50 Pro 5G లో ఉన్న టాప్-5 ఫీచర్లు
1.5K డిస్ప్లే: Motorola Edge 50 Pro 5G డివైజ్ లో 6.7-ఇంచ్ పంచ్ హోల్ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, 3డీ కర్వ్డ్ పీఓఎల్ఈడీ ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+ సపోర్ట్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
10MP టెలీఫోటో లెన్స్: మోటోరోలా ఎడ్జ్50 ప్రో 5జీ లో అద్భుతమైన కెమెరా యూనిట్ ఉంది. ఈ ఫోన్ లో 10ఎంపి టెలీఫోటో 30x హైబ్రిడ్ జూమ్ లెన్స్, 13ఎంపి అల్ట్రావైడ్ + మ్యాక్రో కెమెరా, 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
125W ఫాస్ట్ చార్జింగ్: Motorola Edge 50 Pro 5G లో 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అందిస్తున్నారు. కొన్ని నిమిషాల్లోనే 1 నుంచి 100 శాతం వరకు ఫోన్ చార్జ్ అవుతుంది. అలాగే ఈ ఫోన్ 50 వాట్ వైర్లెస్ టర్బోపవర్ చార్జ్ టెక్నాలజీతో వస్తోంది. ఇంకా ఈ ఫోన్ 10 వాట్ వైర్లెస్ పవర్ షేరింగ్ ఫీచర్ ని కలిగి ఉంది.
4NM చిప్సెట్: మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 5జీ డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ అందిస్తున్నారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన చిప్. దీని మ్యాగ్జిమమ్ క్లాక్ స్పీడ్ 2.63Ghz.
హలో యూఐ: Motorola Edge 50 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హలో యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. హలో యూఐ యూజర్ కి ఉత్తమమైన, ఆకర్షణీయమైన అనుభూతిని అందిస్తుంది. మోటోరోలా సంస్థ ఈ ఫోన్ కి 3 మేజర్ ఓఎస్ అప్డేట్స్ ని అందించనుంది.
