ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola ఈ నెల ఆరంభంలో Motorola Edge 50 Pro డివైజ్ ని లాంచ్ చేసింది. రూ.31,999 ధరతో ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. అయితే ఈ ఫోన్‌ని ఇప్పుడు తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ సేల్ సందర్భంగా Motorola Edge 50 Pro డివైజ్ రూ.30,000 లోపు ధరకే లభించనుంది. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.
Motorola Edge 50 Pro ఆఫర్ వివరాలు
Motorola Edge 50 Pro డివైజ్ ని ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా రూ.27,999 కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లను కలుపుకుని ఈ ధరకి లభిస్తుంది. హ్యాండ్సెట్ అసలు ధర రూ.31,999 (8జిబి+256జిబి) గా ఉంది. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ అసలు ధర రూ.35,999 గా ఉంది.
Motorola Edge 50 Pro స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Motorola Edge 50 Pro లో 6.7-ఇంచ్ స్క్రీన్, 1.5కే పీఓఎల్ఈడీ కర్వ్డ్ ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
చిప్సెట్: Motorola Edge 50 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో జీపీయూ ఉన్నాయి.
ర్యామ్, స్టోరేజీ: Motorola Edge 50 Pro డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి.
ఓఎస్: Motorola Edge 50 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 17 వరకు ఓఎస్ అప్డేట్స్ ఈ ఫోన్‌కి వస్తాయి.
బ్యాటరీ: Motorola Edge 50 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 125 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.
ఇతర ఫీచర్లు: Motorola Edge 50 Pro డివైజ్ లో డాల్బీ అట్మాస్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రేటింగ్ రెసిస్టన్స్ ఉన్నాయి.
