
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నేడు భారతీయ మార్కెట్ లో Motorola G04s అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఇదివరకే గ్లోబల్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ లో 50ఎంపి ఏఐ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, వర్చువల్ ర్యామ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి డివైజ్ ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
Motorola G04s ధర, లభ్యత, కలర్ ఆప్షన్స్
Motorola G04s స్మార్ట్‌ఫోన్ సింగిల్ మెమొరీ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. ధర ఎంతో తెలుసుకుందాం.
Motorola G04s 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.6,999 గా నిర్ణయించారు. జూన్ 5 నుంచి ఫ్లిప్ కార్ట్ మరియు మోటోరోలా.ఇన్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా ఫోన్ విక్రయానికి రానుంది. కాన్‌కర్డ్ బ్లాక్, సీ గ్రీన్, శాటిన్ బ్లూ మరియు సన్‌రైజ్ ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Motorola G04s స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Motorola G04s లో 6.56-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3, పంచ్ హోట్ కటౌట్ ఉన్నాయి.
చిప్సెట్: Motorola G04s లో UniSoc T606 ప్రాసెసర్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 జీపీయూ వినియోగించారు.
ర్యామ్, స్టోరేజీ: Motorola G04s డివైజ్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. ర్యామ్ బూస్ట్ టెక్నాలజీ ద్వారా 4జిబి వరకు ర్యామ్‌ని పెంచుకోవచ్చు. దీంతో యూజర్‌కి గరిష్టంగా 8జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
కెమెరా: Motorola G04s డివైజ్ లో 50ఎంపి ఏఐ కెమెరా ఉంది. ఇది పొట్రెయిట్ మోడల్, ఆటో నైట్ విజన్ సపోర్ట్ కలిగి ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
బ్యాటరీ: Motorola G04s లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
ఓఎస్: Motorola G04s డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. తదుపరి ఓఎస్ అప్డేట్స్, సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.
ఇతర ఫీచర్లు: Motorola G04s లో డాల్బీ అట్మాస్ ఆడియో, డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్, ఐపీ52 రేటింగ్ ఉంటాయి.












