
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Motorola నేడు భారతీయ మార్కెట్ లో Moto G14 4G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ సరికొత్త మోటో జీ-సిరీస్ ఫోన్ సెంటర్-పొజిషన్డ్ పంచ్-హోల్ డిస్ప్లే, డ్యూయల్ కెమెరాలు, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వచ్చింది. ఈ హ్యాండ్సెట్ ఐపీ52 స్ప్లాష్ రెసిస్టన్స్, స్టీరియో స్పీకర్స్, డాల్బి అట్మాస్ వంటి ఫీచర్లతో వచ్చింది. సరే, ఓసారి Moto G14 4G ఫోన్ భారతీయ మార్కెట్ ధర, స్పెసిఫికేషన్స్ ని తెలుసుకుందాం పదండి.
భారత్ లో Moto G14 4G ధర, సేల్ వివరాలు
- Moto G14 4G స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.9,999 గా ఉంది.
- Moto G14 4G హ్యాండ్సెట్ స్కై బ్లూ, స్టీల్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ హ్యాండ్సెట్ ఇప్పటికే ప్రీ-ఆర్డర్స్ కి అందుబాటులో ఉంది.
- ఆగస్టు 8 వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి Moto G14 4G సేల్ మొదలవుతుంది.
- ప్రీ-ఆర్డర్ చేసుకున్న కస్టమర్లకు కంపెనీ రూ.3,200 విలువజేసే స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ని ఉచితంగా అందిస్తోంది. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్స్ పై రూ.750 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఈ బెనిఫిట్స్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా మాత్రమే పొందవచ్చు.
- మోటోరోలా సంస్థ రూ.3,000 విలువజేసే రిలయన్స్ జియో బెనిఫిట్స్ అందిస్తోంది. ఇది రూ.399 పోస్ట్-పెయిడ్ ప్లాన్ కి మాత్రమే వర్తిస్తుంది. ఇంకా రూ.1000 విలువగల 100జిబి అదనపు డేటా, రూ.2,000 విలువజేసే పార్ట్నర్ కూపన్స్ కూడా లభిస్తాయి.
Moto G14 4G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Moto G14 4G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 89.47 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, పాండా గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.
- చిప్సెట్: Moto G14 4G డివైజ్ లో యూనిఎస్ఓసీ టీ616 చిప్ వాడారు. ఇది 12 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 జీపీయూ అందించారు.
- ర్యామ్, స్టోరేజీ: Moto G14 4G లో 4జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ అందించారు. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో స్టోరేజీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.
- ఓఎస్: Moto G14 4G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
- కెమెరా: Moto G14 4G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Moto G14 4G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 20 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Moto G14 4G లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ52 రేటింగ్, డాల్బి అట్మాస్, స్టీరియో స్పీకర్స్, 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.











