హైలైట్స్:
- భారత్ లో లాంచ్ అయిన మోటో జీ32 స్మార్ట్ ఫోన్
- స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్ లో ప్రధాన ఫీచర్లు
- భారత్ లో మోటో జీ32 ధర రూ.12,999
మోటో జీ32 స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచ్ అయ్యింది. భారత్ లో లాంచ్ అయిన లేటెస్ట్ జీ-సిరీస్ మోటోరోలా ఫోన్ ఇదే. గత నెలలో ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్స్ లో విడుదలైంది. కాగా, ఈ ఫోన్ కేవలం 4జీ ఎల్టీఈ కనెక్టివిటీని కలిగి ఉంది. సెల్ఫీ స్నాపర్ కోసం ఇందులో సెంటర్ పొజిషన్డ్ పంచ్ హోల్ కటౌట్ ను అందించారు. ఫ్లాట్ ఎడ్జెస్, తక్కువ సైజులో బాటమ్ చిన్ తో స్క్రీన్ చక్కగా కనిపిస్తోంది. ఇక ట్రిపుల్ కెమెరా సెటప్ స్క్వేర్ మాడ్యూల్ లో ఉంది. భద్రత కోసం ఈ ఫోన్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. స్ప్లాష్ రెసిస్టన్స్ కోసం ఇందులో ఐపీ52 రేటింగ్ ఉంది. అలాగే మంచి సౌండ్ కోసం డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది.
స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.
భారత్ లో Moto G32 ధర, లభ్యమయ్యే తేదీ
భారత్ లో మోటో జీ32 ధర రూ.12,999 గా నిర్ణయించబడింది. ఈ ఫోన్ శాటిన్ సిల్వర్, మినరల్ గ్రే అనే రెండు రంగుల్లో లభ్యం కానుంది. ఫ్లిప్ కార్ట్ ద్వారా ఆగస్టు 16 నుంచి ఈ హ్యాండ్సెట్ సేల్ కి అందుబాటులోకి వస్తుంది. హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా మోటో జీ32 ని కొనుగోలు చేసేవారికి రూ.1250 డిస్కౌంట్ లభించనుంది.
Moto G32 స్పెసిఫికేషన్స్
6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, డీసీఐ-పీ3 కలర్ గేముత్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ మోటో జీ32 లో ఉన్నాయి. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ని మోటో జీ32 లో అమర్చారు. అడ్రెనో 610 జీపీయూ, 4జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి ఇంటర్నల్ స్టోరేజీ, 1టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజీ (మెమొరీ కార్డ్ ద్వారా), ఆండ్రాయిడ్ ఓఎస్ వంటి స్పెసిఫికేషన్స్ మోటో జీ32 లో ఉన్నాయి.
మోటో జీ32 స్మార్ట్ ఫోన్ లో వెనకాల మూడు కెమెరాలున్నాయి. వీటిలో ఒకటి 50ఎంపి ప్రైమరీ సెన్సర్, రెండోది 8ఎంపి అల్ట్రావైడ్ మరియు డెప్త్ సెన్సర్, మూడోది 2ఎంపి మ్యాక్రో కెమెరా. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 16ఎంపి కెమెరాను అమర్చారు.
మోటో జీ32 లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ 5.2, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, డ్యూయల్ సిమ్, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇక డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మాస్ సపోర్ట్, డ్యూయల్ మైక్రోఫోన్స్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఈ ఫోన్లో ఉన్నాయి.