ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో జీ-సిరీస్ లో ఒక మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. Motorola G54 5G డివైజ్ పై ప్రస్తుతం మోటోరోలాం సంస్థ పని చేస్తున్నట్లు సమాచారం. గతేడాది లాంచైన Motorola G53 కి ఇది సక్సెసర్ గా రానుంది. ఇకపోతే రీసెంట్ గా Moto G14 డివైజ్ ని కంపెనీ లాంచ్ చేసింది. తాజా లీక్ ద్వారా, Motorola G54 5G డివైజ్ కి సంబంధించిన కలర్ వేరియంట్స్, స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Motorola G54 5G స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ (లీక్)
The Tech Outlook ప్రచురించిన ఒక కథనం ద్వారా Motorola G54 5G డివైజ్ వివరాలు తెలిసాయి. Cancum 5G అనే కోడ్ నేమ్ తో Motorola G54 5G పేర్కొనబడింది. ఇంకా ఇంటర్నల్ డెవలప్మెంట్ స్టేజీలో ఉన్నప్పుడు కంపెనీలు ఇలా కోడ్ నేమ్స్ వాడతాయి. కోడ్ నేమ్ ని బట్టి, డివైజ్ Motorola G54 5G అని ప్రాథమికంగా అర్థమవుతోంది.
- డిస్ప్లే: Motorola G54 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో, పంచ్-హోల్ కటౌట్ ఉంటాయి.
- చిప్సెట్: Motorola G54 5G లో ఏ చిప్సెట్ వాడుతున్నారో అనే విషయం ప్రస్తుతానికి రహస్యంగానే ఉంది. త్వరలోనే ఈ వివరాలు బయటకు రానున్నాయి.
- ర్యామ్, స్టోరేజీ: Motorola G54 5G డివైజ్ లో 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఉంటాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.
- రియర్ కెమెరా: Motorola G54 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి క్వాడ్ పిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సర్ ఉంటుంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) తో వస్తోంది. ఈ కెమెరా మ్యాక్రో విజన్, నైట్ విజన్, పొట్రెయిట్ మోడ్, లాంగ్ ఎక్స్పోజర్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుందని సమాచారం. గ్రూప్ ఫోటోస్ ని ఆప్టిమైజ్ చేసేందుకు Face Retouch (ఫేస్ రీటచ్) ఫీచర్ కూడా ఉంటుందని తెలుస్తోంది.
- ఫ్రంట్ కెమెరా: Motorola G54 5G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: Motorola G54 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. చార్జింగ్ స్పీడ్ వివరాలు ఇంకా తెలియలేదు.
- ఓఎస్: Motorola G54 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
Motorola G54 5G డిజైన్
Motorola G54 5G రెండర్స్ ని బట్టి, ఈ ఫోన్ వాల్యూమ్ రాకర్స్, పవర్ బటన్ కుడివైపున ఉన్నాయి. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ పవర్ బటన్ లో ఎంబెడ్ అయి ఉంది. ఇతర రూమర్ల ప్రకారం, ఈ ఫోన్ వాటర్-రిపెల్లెంట్ డిజైన్, భారీ స్టీరియో స్పీకర్, డాల్బీ అట్మాస్, మోటో స్పేషియల్ సౌండ్ వంటి ఫీచర్లతో రానున్నట్లు తెలుస్తోంది.
Motorola G54 5G కలర్ ఆప్షన్స్
త్వరలో మోటోరోలా కంపెనీ నుంచి రానున్న Motorola G54 5G స్మార్ట్ ఫోన్ అండ్రోసియా, బ్యాలడ్ బ్లూ, కార్నెట్ బ్లూ, ఔటర్ స్పేస్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.
Motorola G54 5G ధర, లాంచ్ తేదీ
Motorola G54 5G డివైజ్ ధర మరియు లాంచ్ తేదీ వివరాలు ఇంకా బయటకు రాలేదు. త్వరలోనే కంపెనీ నుంచి అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
