డిసెంబర్ 15 న లాంచ్ కానున్న Motorola Moto X40

హైలైట్స్

  • 60 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తోన్న Motorola Moto X40
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో రానున్న Motorola Moto X40
  • డిసెంబర్ 15 న Motorola Moto X40 లాంచ్ కి ముహూర్తం ఖరారు

Motorola Moto X40 లాంచ్ తేదీ రివీల్ అయ్యింది. Motorola Moto X40 డిసెంబర్ 15 న లాంచ్ అవుతోంది. ఈ విషయాన్ని కంపెనీ స్వయంగా కన్ఫర్మ్ చేసింది. Motorola Moto X40 డివైజ్ డిసెంబర్ 15 న చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇది హై-ఎండ్ స్పెసిఫికేషన్స్ తో వస్తోంది. మోటోరోలా నుంచి వస్తున్న ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ వాడనున్నారు. ఓసారి Motorola Moto X40 యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Motorola Moto X40 స్పెసిఫికేషన్స్ (అంచనా)

Motorola Moto X40 స్మార్ట్ ఫోన్ లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఓఎల్ఈడీ ప్యానెల్, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. హెచ్డీఆర్10+ కి ఈ డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఇది 4 నానో మీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైన, 3.2 గిగాహెర్ట్జ్ స్పీడ్ కలిగిన ప్రాసెసర్. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 740 జీపీయూ వాడనున్నారు. ఈ ఫోన్ లో ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ ని ప్రొవైడ్ చేయనున్నారు.

భద్రత కోసం Motorola Moto X40 లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండనుంది. 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్ వంటి ఇతర అన్ని ముఖ్యమైన కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉండనున్నాయి. Motorola Moto X40 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

ఇప్పుడు Motorola Moto X40 యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 12ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 60ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. వ్లాగింగ్ చేసే వారికి ఈ 60ఎంపి కెమెరా ఎంతగానో ఉపయోగపడనుంది.

Motorola Moto X40 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ప్రొవైడ్ చేయనున్నారు. ఓ లీక్ ప్రకారం, ఈ ఫోన్ ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ రేటింగ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే Motorola Moto X40 లో 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉండే అవకాశం ఉంది. అయితే ఇక్కడ అందించిన స్పెసిఫికేషన్స్ లీక్స్ ఆధారంగా వేయబడిన అంచనా మాత్రమే. డిసెంబర్ 15 న స్పెసిఫికేషన్స్ పై కచ్చితమైన సమాచారం తెలుస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleOla Electric స్కూటర్ ని ఉచితంగా గెలుచుకునే అవకాశం
Next articleడిసెంబర్ 11 న లాంచ్ అవుతోన్న Xiaomi 13 సిరీస్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.