ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023 సందర్భంగా ఎన్నో మోటోరోలా ఫోన్లపై డిస్కౌంట్స్ లభించనున్నాయి. అక్టోబర్ 8 నుంచి ఫ్లిప్కార్ట్ సేల్ ప్రారంభం అవుతుంది. పాపులర్ బ్రాండ్స్ కి సంబంధించిన డీల్స్ ని ఇంకా ఫ్లిప్కార్ట్ ప్రకటించలేదు. ఈలోపు మోటోరోలా ఇండియా సేల్ కోసం తన ఆఫర్లను ప్రకటించింది. మోటోరోలా ఎడ్జ్, మోటో జీ, మోటో ఈ సిరీస్ ఫోన్లను సేల్ సందర్భంగా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
ఫ్లిప్కార్ట్ సేల్ సందర్భంగా మోటోరోలా ఫోన్ ఆఫర్స్
Moto Edge 40 Neo
- Moto Edge 40 Neo 8జిబి+256జిబి మోడల్ ని బ్యాంక్ మరియు ఎక్స్చేంజ్ ఆఫర్స్ తో రూ.19,999 కే సొంతం చేసుకోవచ్చు.
- 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ని బ్యాంక్, ఎక్స్చేంజ్ ఆఫర్స్ తో రూ.21,999 కే కొనుగోలు చేయవచ్చు.
- Moto Edge 40 Neo లో 144 హెర్ట్జ్ పీ-ఓఎల్ఈడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, మీడియాటెక్ డైమెన్సిటీ 7030 చిప్, 50ఎంపి మెయిన్ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉన్నాయి.
Motorola G84
- Motorola G84 స్మార్ట్ ఫోన్ ని సేల్ సందర్భంగా అన్ని ఆఫర్స్ కలుపుకుని 12జిబి+256జిబి వేరియంట్ ని రూ.16,999 కే సొంతం చేసుకోవచ్చు.
- Motorola G84 లో 120 హెర్ట్జ్ పీ-ఓఎల్ఈడీ స్క్రీన్, ఆండ్రాయిడ్ 13ఓఎస్, స్నాప్ డ్రాగన్ 695 చిప్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉన్నాయి.
Motorola G54
- Motorola G54 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ని అన్ని ఆఫర్స్ కలుపుకుని రూ.12,999 కి సొంతం చేసుకోవచ్చు.
- Motorola G54 డివైజ్ లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎల్సీడీ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్, 50ఎంపి మెయిన్ కెమెరా, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
Motorola E13
- Motorola E13 డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ఆఫర్స్ తర్వాత రూ.6,749 కి లభిస్తుంది.
- Motorola E13 లో 6.5-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 13ఎంపి మెయిన్ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.
| మోడల్ | అసలు ధర | ఫ్లిప్కార్ట్ సేల్ ఆఫర్ ధర |
| Motorola Edge 30 Ultra | రూ.59,999 | రూ.39,999 |
| Motorola Edge 30 Fusion | రూ.42,999 | రూ.29,999 |
| Motorola Edge 40 | రూ.29,999 | ఇంకా ప్రకటించలేదు |
| Motorola Edge 30 8+128GB | రూ.26,999 | రూ.25,999 |
| Motorola Edge 40 Neo 8+128GB | రూ.23,999 | రూ.19,999 |
| Motorola Edge 40 Neo 12+256GB | రూ.25,999 | రూ.21,999 |
| Moto G84 | రూ.19,999 | రూ.16,999 |
| Moto G73 | రూ.18,999 | రూ.14,999 |
| Moto G54 8+128GB | రూ.15,999 | రూ.12,999 |
| Moto G54 12+256GB | రూ.18,999 | రూ.14,999 |
| Moto G32 8+128GB | రూ.11,999 | రూ.8,999 |
| Moto G14 4+128GB | రూ.9,999 | రూ.8,099 |
| Moto G13 4+128GB | రూ.9,999 | రూ.8,999 |
| Moto E32 | రూ.8,999 | రూ.8,099 |
| Moto E13 2+64GB | రూ.6,999 | రూ.5,399 |
| Moto E13 4+64GB | రూ.7,999 | రూ.5,849 |
| Moto E13 8+128GB | రూ.11,999 | రూ.8,999 |
