ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా త్వరలో Motorola Razr 2023 మడతబెట్టే ఫోన్ ని లాంచ్ చేయనుంది. 2023 లోనే ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు మోటోరోలా నుంచి Motorola Razr 2023 కి సంబంధించిన ఎటువంటి వివరాలు బయటకు రాలేదు. అయితే తాజాగా ఒక లీక్ ద్వారా Motorola Razr 2023 డివైజ్ డిజైన్ రెండర్స్ బయటకు వచ్చాయి.
లీకైన Motorola Razr 2023 రెండర్స్ ని బట్టి ఫోన్ భారీ కవర్ డిస్ప్లేతో వస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్ లో అండర్-డిస్ప్లే సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉంది. ఈ అండర్-డిస్ప్లే సెల్ఫీ కెమెరా పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
డిజైన్ రెండర్స్ ద్వారా లీకైన Motorola Razr 2023 ఫస్ట్ లుక్
పైన కనిపిస్తోన్న లీకైన రెండర్ ఇమేజెస్ ని ప్రముఖ టిప్ స్టర్ ఇవాన్ బ్లాస్ పోస్ట్ చేశాడు. Motorola Razr 2023 ఈ పిక్స్ లో మాదిరి ఉండనుంది. కవర్ డిస్ప్లే ని చూస్తుంటే, దాదాపుగా ఫోన్ రియర్ ప్యానెల్ ని ఆక్రమించినట్లు అనిపిస్తోంది. ఈ ఫోన్ లో డ్యూయల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
కవర్ డిస్ప్లే యొక్క కచ్చితమైన సైజ్ ఇంకా తెలియదు. కానీ, 3.26-ఇంచ్ వరకు ఉండొచ్చని అంచనా వేయవచ్చు. OPPO Find N2 Flip లో కూడా ఇలాంటిదే ఉంటుంది.
ఇప్పుడు మెయిన్ డిస్ప్లే గురించి తెలుసుకుందాం. Motorola Razr 2023 లో సెల్ఫీ కెమెరి కటౌట్ కనిపించడం లేదు. అంటే ఈ ఫోన్ అండర్-డిస్ప్లే ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుందని అనుకోవచ్చు. లేదంటే అస్సలు ఫ్రంట్ కెమెరానే ఉండకపోవచ్చు. అంటే ఔటర్ డిస్ప్లే పై ఉండే మెయిన్ కెమెరానే సెల్ఫీ కెమెరా మాదిరి పని చేస్తుంది.
ఇలా ఔటర్ డిస్ప్లే పై ఉండే మెయిన్ కెమెరాను ఫ్రంట్ కెమెరా లాగా వాడుకోవడం వల్లన ఇన్నర్ డిస్ప్లే పై హోల్ లేకుండా పూర్తి డిస్ప్లే అనుభూతిని పొందవచ్చు. దీంతో మరింత ఇమ్మర్సివ్ ఎక్స్‌పీరియన్స్ యూజర్ కి లభిస్తుంది. చాలామంది తమ ఫోన్ డిస్ప్లే పై ఎటువంటి హోల్ లేదా నాచ్ ఉండటాన్ని ఇష్టపడరు. దీని వల్లన వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ దెబ్బతింటుంది. మరి దీనికి మోటోరోలా రేజర్ రూపంలో సొల్యూషన్ తీసుకొస్తుందేమో చూడాలి.
Motorola Razr 2023 కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ప్రస్తుతానికి తెలియలేదు. అయితే ఈ ఫోన్ క్వాల్కమ్ లేదా మీడియాటెక్ కంపెనీలకు చెందిన ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ని కలిగి ఉండనుందని చెప్పవచ్చు. త్వరలోనే ఈ ఫోల్డబుల్ ఫోన్ కి సంబంధించిన వివరాలను మోటోరోలా రివీల్ చేసే అవకాశం ఉంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
