Home News లీకైన Motorola Razr (2023) లాంచ్ తేదీ

లీకైన Motorola Razr (2023) లాంచ్ తేదీ

Highlights
  • Samsung Galaxy Z Flip 5 కంటే ముందే లాంచ్ కానున్న Motorola Razr (2023)
  • జూన్ 1 న Motorola Razr (2023) లాంచ్ అయ్యే అవకాశం
  • Juno అనే కోడ్ నేమ్ ని కలిగి ఉన్న Motorola Razr (2023) డివైజ్

ఈ వారం ఆరంభంలో ప్రముఖ టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ Motorola Razr (2023) కి సంబంధించిన డిజైన్ ని రివీల్ చేశారు. ఈ డివైజ్ Motorola Razr (2022) కి సక్సెసర్ గా వస్తోంది. తాజాగా ఇవాన్ నుంచి వచ్చిన కొత్త లీక్ ద్వారా Motorola Razr (2023) డివైజ్ లాంచ్ తేదీ బయటకు వచ్చింది. Samsung Galaxy Z Flip 5 కంటే ముందే Motorola Razr (2023) లాంచ్ కానుందని లీక్ ద్వారా స్పష్టమవుతోంది. ఇకపోతే Galaxy Z Flip 5 ఆగస్టులో లాంచ్ కానుందని సమాచారం.

జునో అనౌన్స్‌మెంట్ రివీల్ + ఈవెంట్ యాక్టివేషన్ లాంచ్ తేదీ జూన్ 1 గా నిర్ణయించబడింది. ఇక్కడ జునో (Juno) అంటే Motorola Razr (2023) యొక్క కోడ్ నేమ్. లాంచ్ కి ఇంకా కొన్ని నెలల సమయం ఉండటంతో ఈలోపు ఫోన్ కి సంబంధించిన టీజర్లు స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసే అవకాశం ఉంది.

Motorola Razr (2023) విశేషాలు

ప్రస్తుతానికి Motorola Razr (2023) కి సంబంధించిన కొన్ని వివరాలు మాత్రమే తెలిసాయి. ఈ డివైజ్ 144Hz రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తున్నట్లు స్పష్టమైంది. మోటోరోలా సంస్థ మరొక ఫ్లిప్ ఫోన్ పై కూడా పని చేస్తోంది. ఈ ఫోన్ కి Venus అనే కోడ్ నేమ్ ఇచ్చింది. ఈ డివైజ్ స్పెసిఫికేషన్స్ ప్రస్తుతానికి అందుబాటులో లేవు.

Motorola Razr (2022) విషయానికి వస్తే, ఇందులో 6.7-ఇంచ్ ఫోల్డబుల్ ఓఎల్ఈడీ డిస్ప్లే, పంచ్-హోల్ డిజైన్, కవర్ డిస్ప్లే వంటివి ఉన్నాయి. Motorola Razr (2023) డివైజ్ లో కవర్ డిస్ప్లే భారీ అప్‌గ్రేడ్ ని పొందనున్నట్లు తెలిసింది. ఇటీవలె లీకైన పిక్స్ కూడా ఆ విషయాన్ని స్పష్టం చేసాయి.

Motorola Razr (2023) డివైజ్ లో 3.5-ఇంచ్ భారీ కవర్ డిస్ప్లే ఉండనుందని సమాచారం. ఔటర్ స్క్రీన్ పై డ్యూయల్ కెమెరాలు, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. భద్రత కోసం సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ని ఈ ఫోన్ లో అందించారు. Motorola Razr (2023) లో అండర్ డిస్ప్లే సెల్ఫీ కెమెరా ఉంటుందని లీకైన రెండర్ ఇమేజెస్ ద్వారా తెలిసింది. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. అండర్ డిస్ప్లే ఫ్రంట్ కెమెరా ఉంటుందా? లేదా ఫ్రంట్ కెమెరా బదులుగా రియర్ కెమెరానే ఫ్రంట్ కెమెరాలా కూడా వాడుకోవాలా? అనేద విషయాలు త్వరలోనే తెలియనున్నాయి.

Motorola Razr 2023 కి సంబంధించిన మిగతా స్పెసిఫికేషన్స్ ప్రస్తుతానికి తెలియలేదు. అయితే ఈ ఫోన్ క్వాల్కమ్ లేదా మీడియాటెక్ కంపెనీలకు చెందిన ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ని కలిగి ఉండనుందని చెప్పవచ్చు. త్వరలోనే ఈ ఫోల్డబుల్ ఫోన్ కి సంబంధించిన వివరాలను మోటోరోలా రివీల్ చేసే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.