
Motorola Razr 40 మరియు Motorola Razr 40 Ultra ఫ్లిప్ ఫోన్లు భారతదేశంలో లాంచ్ అయ్యాయి. Motorola Razr 40 Ultra గురించి మాట్లాడితే, ఇది పెద్ద 3.6-అంగుళాల కవర్ స్క్రీన్‌ను కలిగి ఉంది. అలాగే, ఈ ఫోన్ ఇప్పటికే మార్కెట్లో ఉన్న Samsung Galaxy Z Flip 4 5Gకి పోటీనివ్వనుంది. మేము మీకు రెండు ఫోన్ల ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్ల వివరాలను ఇక్కడ అందిస్తున్నాం.
Motorola Razr 40 సిరీస్ ధర, లభ్యత
- రూ.89,999 ధరతో భారత్ లో లాంచైన Motorola Razr 40 Ultra
- రూ.59,999 ధరతో భారత్ లో లాంచైన Motorola Razr 40
రిలయన్స్ డిజిటల్ మరియు అమెజాన్ ద్వారా Motorola Razr 40 సిరీస్ ఫోన్లు భారత్ లో విక్రయించబడనున్నాయి. ఫోన్ల పై డిస్కౌంట్ ఆఫర్లు కూడా ఉంటాయి. ఆఫర్ ద్వారా యూజర్ అల్ట్రా మోడల్ పై రూ.7,000, స్టాండర్డ్ మోడల్ పై రూ.5,000 డిస్కౌంట్ పొందవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేస్తే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
Motorola Razr 40 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: 6.9-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 10-బిట్ ఎల్టీపీవో పీఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 22:9 యాస్పెక్ట్ రేషియో, 1400-నిట్స్ పీక్ బ్రైట్నెస్, పంచ్-హోల్ కౌటౌట్ ఉంటాయి.
- కవర్ డిస్ప్లే: Motorola Razr 40 లో 1.5-ఇంచ్ ఓఎల్ఈడీ కవర్ స్క్రీన్, 1000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Motorola Razr 40 లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్, అడ్రెనో జీపీయూ ఉన్నాయి.
- ర్యామ్, స్టోరేజీ: Motorola Razr 40 లో 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి.
- ఓఎస్: Motorola Razr 40 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మైయూఎక్స్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: Motorola Razr 40 లో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, లేజర్ ఆటోఫోకస్ ఉన్నాయి. దీంతో పాటు 13ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
- బ్యాటరీ: Motorola Razr 40 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 30 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే 5 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
- ఇతర ఫీచర్లు: Motorola Razr 40 లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ52 రేటింగ్ ఉన్నాయి.
Motorola Razr 40 Ultra స్పెసిఫికేషన్స్
- మెయిన్ డిస్ప్లే: Motorola Razr 40 Ultra లో 6.9-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 10-బిట్ ఎల్టీపీవో పీఓఎల్ఈడీ డిస్ప్లే, 1 హెర్ట్జ్ – 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 10-బిట్ హెచ్డీఆర్10+, 123 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్, 22:9 యాస్పెక్ట్ రేషియో, 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
- కవర్ స్క్రీన్: Motorola Razr 40 Ultra లో 3.6-ఇంచ్ క్విక్‌వ్యూ పీఓఎల్ఈడీ డిస్ప్లే, 1056*1066 పిక్సెల్ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Motorola Razr 40 Ultra లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్, అడ్రెనో జీపీయూ ఉన్నాయి.
- ర్యామ్, స్టోరేజీ: Motorola Razr 40 Ultra లో 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి.
- ఓఎస్: Motorola Razr 40 Ultra డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
- కెమెరా: Motorola Razr 40 Ultra స్మార్ట్ ఫోన్ లో 12ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ఇందులో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
- బ్యాటరీ: Motorola Razr 40 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 3800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే 5 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంది.
- ఇతర ఫీచర్లు: Motorola Razr 40 Ultra లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్, వీగన్ లెదర్ బ్యాక్, ఐపీ52 రేటింగ్ ఉన్నాయి.











