
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ సేల్ లో భాగంగా స్మార్ట్‌ఫోన్లపై ఆకర్షణీయమైన డీల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం Motorola Razr 40, Motorola Razr 40 Ultra లపై లభిస్తోన్న డీల్స్ వివరాలు తెలుసుకుందాం. ఈ మోడల్స్, ఇటీవలె లాంచైన రేజర్ 50 లైనప్ కంటే ముందు వచ్చాయి. సరే, ఓసారి డిస్కౌంట్ ఆఫర్ వివరాలు తెలుసుకుందాం.
Motoroal Razr 40, Motoroal Razr 40 Ultra డీల్స్
Motoroal Razr 40 Ultra యొక్క సింగిల్ వేరియంట్ (8జిబి/256జిబి) ధర రూ.89,999 గా ఉంది. మరోవైపు, Motoroal Razr 40 మోడల్ రూ.59,999 తో లాంచ్ అయ్యింది.
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా Motoroal Razr 40 Ultra కేవలం రూ.46,749 ధరతో లిస్ట్ అయ్యింది. అంటే ఏకంగా రూ.43,250 డిస్కౌంట్ అన్నమాట.
ఎస్బీఐ కార్డ్ పై పూర్తి చెల్లింపు చేస్తే, రూ.750 డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అలాగే ఈఎంఐ ద్వారా రూ.1500 డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో ఫోన్ ధర రూ.45,999 కి చేరుతుంది.
మరోవైపు, Motoroal Razr 40 ప్రస్తుతానికి అందుబాటులో లేదు. కానీ, ధర మాత్రం అమెజాన్ పై రూ.32,999 అని టీజ్ చేశారు. ఇది బ్యాంక్ ఆఫర్ తో కలుపుకుని అనే విషయం గమనించాలి.
Motorola Razr 40 మరియు Motorola Razr 40 Ultra మీరు కొనవచ్చా?
మోటోరోలా రేజర్ 40, రేజర్ 40 అల్ట్రా ఫోల్డబుల్ ఫోన్లు మార్కెట్ లోకి వచ్చి ఏడాది అవుతోంది. అయితే, మీరు గనుక డిఫరెంట్ గా ఉండే ఫోన్లను ఇష్టపడే వారైతే, ఈ ఫోన్లు సరైన ఎంపిక అవ్వవచ్చు. ఈ ఫోల్డబుల్ ఫోన్లు ప్రముఖ బ్రాండ్ నుంచి వచ్చినవి. పైగా, ఈ ఫోన్లలో బ్లోట్‌వేర్ లేదా యాడ్స్ అనేవి కనిపించవు. నాజూకైన, దృఢమైన బిల్డ్ క్వాలిటీని ఈ ఫోన్లు కలిగి ఉన్నాయి.
అల్ట్రా మోడల్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్ వాడారు. రోజువారీ వినియోగానికి ఇది ఎంతో బాగా పని చేస్తుంది. మల్టీ-టాస్కింగ్, గేమింగ్ ను కూడా బాగా హ్యాండిల్ చేయగలదు. అంతేకాదు, బ్యాక్ ప్యానెల్ పై 3.6-ఇంచ్ సెకండ్ స్క్రీన్ కూడా కలదు. మ్యూజిక్ కంట్రోలింగ్, నోటిఫికేషన్స్ మరియు ఇతర పనులను ఈ బ్యాక్ స్క్రీన్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు.
ఇన్ని లాభాలున్నా, బ్యాటరీ విషయంలో రాజీపడక తప్పదు. ఎందుకంటే ఇందులో కేవలం 3,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.
మరోవైపు, రేజర్ 40 లో వాడిన స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్ కాస్త పాతదని చెప్పవచ్చు. ప్రత్యేకించి రూ.35,000 సెగ్మెంట్ లో స్నాప్‌డ్రాగన్ 8-సిరీస్ ప్రాసెసర్స్ గల ఫోన్లు లభిస్తున్నాయి. ఇంకా ఏఐ ఫీచర్స్ తో కూడా వస్తున్నాయి. ఈ ఫోన్ లో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. బ్యాక్ ప్యానెల్ పై 1.47-ఇంచ్ సెకండరీ లెన్స్ ఉంది. ఇక ఇదే ధర శ్రేణిలో ఇంకా మంచి ఫోన్లు కూడా ఉన్నాయి.
మీకు కచ్చితంగా, ఫోల్డబుల్ ఫోన్ బడ్జెట్ లో కావాలంటే, అదీనూ శాంసంగ్ లాంటి ఫోల్డబుల్ ఫోన్లను కొనే పరిస్థితి లేకుంటే, మీరు మోటోరోలా రేజర్ 40 అల్ట్రాను కొనుగోలు చేయవచ్చు. ఇక ఆల్టర్నేటివ్స్ విషయానికి వస్తే, OnePlus 12R, iQOO 12, OnePlus Nord 4, iQOO Neo 9 Pro ఉన్నాయి.











