
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా తాజాగా Motorola Razr 40 Ultra, Motorola Razr 40 డివైజెస్ ని లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లు కూడా క్లామ్‌షెల్ డిజైన్ తో వచ్చాయి. వీటిలో బ్యాక్ ప్యానెల్ పైన సెకండరీ డిస్ప్లే ఉంది. Motorola Razr 40 Ultra డివైజ్ లో 6.9-ఇంచ్ పీఓఎల్ఈడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 3.6-ఇంచ్ సెకండరీ డిస్ప్లే, 12ఎంపి డ్యూయల్ కెమెరా సెటప్, 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
మరోవైపు Motorola Razr 40 లో 6.9-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1.5-ఇంచ్ సెకండరీ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్, 64ఎంపి డ్యూయల్-కెమెరా సెటప్, 32ఎంపి సెల్ఫీ కెమెరా, 4200 ఎంఏహెచ్ బ్యాటరీ, 30 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 8 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
Motorola Razr 40, Motorola Razr 40 Ultra ధర, లభ్యత
Motorola Razr 40 అజూర్ గ్రే, చెర్రీ పౌడర్, బ్రైట్ మూన్ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. బేస్ మోడల్ 8జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజీ ధర CNY 3,999 (రూ.46,400) గా ఉంది. 8జిబి/12జిబి మరియు 256జిబి స్టోరేజీ వేరియంట్స్ ధరలు వరుసగా CNY 4,299 (సుమారు రూ.49,900) మరియు CNY 4,699 (సుమారు రూ.54,600) గా ఉంది.
Motorola Razr 40 Ultra డివైజ్ ఇన్ఫినిట్ బ్లాక్, గ్లేసియర్ బ్లూ మరియు వివా మజెంటా కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఇక టాప్ ఎండ్ వేరియంట్ 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ ధర CNY 6,499 (సుమారు రూ.75,400) గా ఉంది. ఈ డివైజ్ సేల్ చైనాలో జూన్ 5 నుంచి ప్రారంభమవుతుంది.
Motorola Razr 40 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: 6.9-ఇంచ్ ఎల్టీపీవో ఓఎల్ఈడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+ సపోర్ట్.
- కవర్ డిస్ప్లే: 1.5-ఇంచ్ డిస్ప్లే
- చిప్సెట్: క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్, అడ్రెనో 644 జీపీయూ
- ర్యామ్, స్టోరేజీ: 8జిబి/12జిబి ర్యామ్, 256/512జిబి స్టోరేజీ
- సాఫ్ట్వేర్: ఆండ్రాయిడ్ 13 ఓఎస్
- రియర్ కెమెరా: 64ఎంపి ప్రైమరీ, 13ఎంపి అల్ట్రావైడ్ లెన్స్
- ఫ్రంట్ కెమెరా: 32ఎంపి కెమెరా
- కనెక్టివిటీ: డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్, 5జీ, వై-ఫై 6ఈ, ఎన్ఎఫ్సీ, జీపీఎస్, బ్లూటూత్, గ్లొనాస్, గెలీలియో, యూఎస్బీ టైప్-సీ పోర్ట్.
- బ్యాటరీ, చార్జింగ్: 4200 ఎంఏహెచ్ బ్యాటరీ, 30 వాట్ చార్జింగ్, 8 వాట్ వైర్లెస్ చార్జింగ్
- ఇతర ఫీచర్లు: డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, డాల్బి అట్మాస్
Motorola Razr 40 Ultra స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: 6.9-ఇంచ్ ఫ్లెక్సీవ్యూ పీఓఎల్ఈడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+ సపోర్ట్, 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్
- కవర్ డిస్ప్లే: 3.6-ఇంచ్ క్విక్‌వ్యూ పీఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100 శాతం డీసీఐ-పీ3 కలర్ గేముత్, 1000 నిట్స్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్.
- చిప్సెట్: క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, అడ్రెనో 730 జీపీయూ.
- ర్యామ్, స్టోరేజీ: 8జిబి/12జిబి ర్యామ్, 256/512జిబి స్టోరేజీ
- సాఫ్ట్వేర్: ఆండ్రాయిడ్ 13 ఓఎస్
- రియర్ కెమెరా: 12ఎంపి ప్రైమరీ కెమెరా, పీడీఏఎఫ్, ఓఐఎస్, 13ఎంపి అల్ట్రావైడ్ కెమెరా
- ఫ్రంట్ కెమెరా: 32ఎంపి కెమెరా
- కనెక్టివిటీ: డ్యూయల్-సిమ్ కార్డ్ స్లాట్, వై-ఫై 6ఈ, ఎన్ఎఫ్సీ, జీపీఎస్, బ్లూటూత్ 5.3, గ్లొనాస్, గెలీలియో, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఎన్ఎఫ్సీ.
- బ్యాటరీ, చార్జింగ్: 3800 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5 వాట్ వైర్లెస్ చార్జింగ్.
- డైమెన్షన్: 170.83 * 73.85 * 6.99మి.మీ
- బరువు: 188 గ్రాములు
- ఇతర ఫీచర్లు: ఐపీ52 రేటింగ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్











