Home News 6.9-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్‌తో లాంచైన Motorola Razr 40, Razr 40 Ultra

6.9-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్‌తో లాంచైన Motorola Razr 40, Razr 40 Ultra

Highlights
  • గ్లోబల్ గా లాంచైన Motorola Razr 40, Razr 40 Ultra
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్‌తో వచ్చిన Razr 40 Ultra
  • Motorola Razr 40 బేస్ మోడల్ ధర CNY 3,999

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా తాజాగా Motorola Razr 40 Ultra, Motorola Razr 40 డివైజెస్ ని లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లు కూడా క్లామ్‌షెల్ డిజైన్ తో వచ్చాయి. వీటిలో బ్యాక్ ప్యానెల్ పైన సెకండరీ డిస్ప్లే ఉంది. Motorola Razr 40 Ultra డివైజ్ లో 6.9-ఇంచ్ పీఓఎల్ఈడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 3.6-ఇంచ్ సెకండరీ డిస్ప్లే, 12ఎంపి డ్యూయల్ కెమెరా సెటప్, 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

మరోవైపు Motorola Razr 40 లో 6.9-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1.5-ఇంచ్ సెకండరీ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్, 64ఎంపి డ్యూయల్-కెమెరా సెటప్, 32ఎంపి సెల్ఫీ కెమెరా, 4200 ఎంఏహెచ్ బ్యాటరీ, 30 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 8 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

Motorola Razr 40, Motorola Razr 40 Ultra ధర, లభ్యత

Motorola Razr 40 అజూర్ గ్రే, చెర్రీ పౌడర్, బ్రైట్ మూన్ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. బేస్ మోడల్ 8జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజీ ధర CNY 3,999 (రూ.46,400) గా ఉంది. 8జిబి/12జిబి మరియు 256జిబి స్టోరేజీ వేరియంట్స్ ధరలు వరుసగా CNY 4,299 (సుమారు రూ.49,900) మరియు CNY 4,699 (సుమారు రూ.54,600) గా ఉంది.

Motorola Razr 40 Ultra డివైజ్ ఇన్‌ఫినిట్ బ్లాక్, గ్లేసియర్ బ్లూ మరియు వివా మజెంటా కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఇక టాప్ ఎండ్ వేరియంట్ 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ ధర CNY 6,499 (సుమారు రూ.75,400) గా ఉంది. ఈ డివైజ్ సేల్ చైనాలో జూన్ 5 నుంచి ప్రారంభమవుతుంది.

Motorola Razr 40 స్పెసిఫికేషన్స్

Motorola Razr 40 Ultra స్పెసిఫికేషన్స్