భారత్‌లో లాంచైన Moto Razr 40 Ultra గ్లేసియర్ బ్లూ కలర్ వేరియంట్

Highlights

  • ఇటీవలె భారత్‌లో లాంచైన Moto Razr 40 Ultra
  • 3.6-ఇంచ్ కవర్ డిస్ప్లేతో వచ్చిన Razr 40 Ultra
  • Moto Razr 40 Ultra ధర రూ.79,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Motorola కొన్ని రోజుల క్రితం Moto Razr 40 Ultra ఫ్లిప్ ఫోన్ ని లాంచ్ చేసింది. శాంసంగ్ ఫ్లిప్ ఫోన్లతో పోల్చితే ఈ డివైజ్ సరసమైన ధరలోనే లభిస్తోంది. తాజాగా Moto Razr 40 Ultra గ్లేసియర్ బ్లూ కలర్ వేరియంట్ లాంచ్ అయ్యింది. ఈ రంగులో ఫోన్ ఆకట్టుకునేలా ఉంది. Moto Razr 40 Ultra డివైజ్ లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ వాడారు. సరే, ఓసారి Moto Razr 40 Ultra యొక్క కొత్త కలర్ వేరియంట్ విశేషాలు, స్పెసిఫికేషన్స్, ధర వివరాలు తెలుసుకుందాం పదండి.

Moto Razr 40 మరియు Moto Razr 40 Ultra డివైజెస్ 2023 జులైలో భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యాయి. Moto Razr 40 Ultra ఇప్పటి వరకు వివా మజెంటా, ఫాంటమ్ బ్లాక్ కలర్స్ లో అందుబాటులో ఉంది. తాజాగా మోటోరోలా కంపెనీ Moto Razr 40 Ultra గ్లేసియర్ బ్లూ వేరియంట్ ని లాంచ్ చేసింది.

Moto Razr 40 Ultra గ్లేసియర్ బ్లూ ధర, లభ్యత

  • Moto Razr 40 Ultra గ్లేసియర్ బ్లూ వేరియంట్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ధర రూ.89,999 గా ఉంది. అమెజాన్ ద్వారా ఈ డివైజ్ ని కొనుగోలు చేయవచ్చు.
  • ఇప్పటికే మోటోరోలా సంస్థ Moto Razr 40 Ultra డివైజ్ ని రూ.10,000 డిస్కౌంట్ తో రూ,79,999 ధర వద్ద విక్రయిస్తోంది. అయితే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ (అమెజాన్ పే ఐసీఐసీఐ కార్డ్ కాదు) కార్డ్స్ ద్వారా యూజర్లు అదనంగా రూ.7,000 డిస్కౌంట్ పొందవచ్చు.

Moto Razr 40 Ultra స్పెసిఫికేషన్స్

  • మెయిన్ డిస్ప్లే: Motorola Razr 40 Ultra లో 6.9-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 10-బిట్ ఎల్టీపీవో పీఓఎల్ఈడీ డిస్ప్లే, 1 హెర్ట్జ్ – 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 10-బిట్ హెచ్డీఆర్10+, 123 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్, 22:9 యాస్పెక్ట్ రేషియో, 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • కవర్ స్క్రీన్: Motorola Razr 40 Ultra లో 3.6-ఇంచ్ క్విక్‌వ్యూ పీఓఎల్ఈడీ డిస్ప్లే, 1056*1066 పిక్సెల్ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Motorola Razr 40 Ultra లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్, అడ్రెనో జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Motorola Razr 40 Ultra లో 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి.
  • ఓఎస్: Motorola Razr 40 Ultra డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Motorola Razr 40 Ultra స్మార్ట్ ఫోన్ లో 12ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ఇందులో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Motorola Razr 40 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 3800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే 5 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంది.
  • ఇతర ఫీచర్లు: Motorola Razr 40 Ultra లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్, వీగన్ లెదర్ బ్యాక్, ఐపీ52 రేటింగ్ ఉన్నాయి.
Previous articleDimensity 9300 చిప్, 100X జూమ్ ఫీచర్‌తో చైనాలో లాంచైన Vivo X100, Vivo X100 Pro
Next articleనవంబర్ 23 న చైనాలో లాంచ్ కానున్న Honor 100 సిరీస్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.