Home News లీకైన Motorola Razr 40 Ultra అఫీషియల్ ప్రెస్ ఇమేజెస్; రివీలైన డిజైన్, కలర్ ఆప్షన్స్!

లీకైన Motorola Razr 40 Ultra అఫీషియల్ ప్రెస్ ఇమేజెస్; రివీలైన డిజైన్, కలర్ ఆప్షన్స్!

Highlights
  • రానున్న కొన్ని రోజుల్లో లాంచ్ కానున్న Motorola Razr 40 Ultra
  • భారీ ఔటర్ డిస్ప్లేతో వస్తోన్న Motorola Razr 40 Ultra
  • మూడు కలర్ ఆప్షన్స్ లో లభించనున్న డివైజ్

మోటోరోలా సంస్థ ఈ ఏడాదిలో ఒక కొత్త ఫోల్డబుల్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే తన ఫోల్డబుల్ ఫోన్ ని కంపెనీ టీజ్ చేసింది. Motorola Razr 40 Ultra అనే పేరుతో ఈ మడతబెట్టే ఫోన్ మార్కెట్ లోకి రానుందని సమాచారం. Motorola Razr 40 పేరుతో మరొక ఫోల్డబుల్ ఫోన్ కూడా మోటోరోలా నుంచి రాబోతోంది. తాజాగా Motorola Razr 40 Ultra డివైజ్ యొక్క అఫీషియల్ ప్రెస్ ఇమేజెస్ లీక్ అయ్యాయి.

ప్రముఖ టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ Motorola Razr 40 Ultra డివైజ్ యొక్క అఫీషియల్ ఇమేజెస్ ని షేర్ చేశాడు. బ్లాస్ షేర్ చేసిన ఇమేజెస్ ద్వారా కలర్ ఆప్షన్స్ కన్ఫర్మ్ అయ్యాయి. సరే, ఓసారి Motorola Razr 40 Ultra స్మార్ట్ ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ మరియు ఇతర వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Motorola Razr 40 Ultra యొక్క లీకైన ఇమేజెస్

Motorola Razr 40 Ultra డివైజ్ ఒక ప్రీమియమ్ ఫోల్డబుల్ ఫోన్. చైనాతో పాటు మరో రెండు మార్కెట్స్ లో ఈ ఫోన్ లాంచ్ కానుందని సమాచారం. ప్రస్తుతం ఉన్న మోడల్ కంటే Motorola Razr 40 Ultra డివైజ్ ఎన్నో అప్‌గ్రేడ్స్ తో రానున్నట్లు తెలుస్తోంది.

Motorola Razr 40 Ultra లో భారీ ఔటర్ డిస్ప్లే, ఫోల్డబుల్ డిజైన్, 3.26-ఇంచ్ కవర్ డిస్ప్లే ఉన్నాయి. రేజర్ 2022 2.7-ఇంచ్ కవర్ డిస్ప్లే తో లాంచైంది. ఇక బ్లాస్ షేర్ చేసిన ఇమేజెస్ ద్వారా ఔటర్ స్క్రీన్ సైజ్ తెలియడం లేదు. అయితే ఇతర ఫోల్డబుల్ ఫోన్ల యొక్క ఔటర్ స్క్రీన్ కంటే ఇది కాస్త పెద్దగా ఉందని అంటోంది.

కెమెరా విభాగం

బ్లాస్ షేర్ చేసిన ఇమేజెస్ ద్వారా Motorola Razr 40 Ultra డివైజ్ మూడు కలర్ ఆప్షన్స్ లో లభించనున్నట్లు తెలుస్తోంది. అవి: బార్బెర్రీ, బ్లాక్ మరియు బ్లూ. అలాగే Motorola Razr 40 Ultra డివైజ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2640*1080 పిక్సెల్ రెజుల్యూషన్ తో రానుందని సమాచారం. మరికొన్న రిపోర్ట్స్ ద్వారా, Motorola Razr 40 Ultra డివైజ్ 6.9-ఇంచ్ ఫోల్డబుల్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ లేదా 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానున్నట్లు సమాచారం.

చిప్సెట్, ర్యామ్

Motorola Razr 40 Ultra స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో రానుందని గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా తెలిసింది. ఈ ఫోన్ 12జిబి ర్యామ్ మరియు 256జిబి స్టోరేజీ తో వస్తున్నట్లు సమాచారం.

బ్యాటరీ, చార్జింగ్

కెమెరా విభాగం

Motorola Razr 40 Ultra స్మార్ట్ ఫోన్ లో 12ఎంపి సోని ఐఎంఎక్స్563 మెయిన్ కెమెరా, 13ఎంపి ఎస్‌కే హైనిక్స్ హై1336 అల్ట్రావైడ్ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. Motorola Razr 40 Ultra డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తోంది.