Home News Motorola: లీకైన Razr 50 5G, Razr 50 Ultra 5G డిజైన్, స్పెసిఫికేషన్స్

Motorola: లీకైన Razr 50 5G, Razr 50 Ultra 5G డిజైన్, స్పెసిఫికేషన్స్

Highlights
  • త్వరలో మోటో రేజర్ 50, 50 అల్ట్రా లాంచ్
  • లీకైన డిజైన్, స్పెసిఫికేషన్స్
  • కలర్స్: పీచ్ ఫజ్, గ్రీన్, బ్లూ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నుంచి త్వరలో ఫోల్డబుల్ సిరీస్ Razr 50 లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Motorola Razr 50 5G మరియు Motorola Razr 50 Ultra 5G ఫోల్డబుల్ ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా ఈ డివైజెస్ యొక్క రెండర్స్ 91mobiles కి అందాయి. దీంతో వీటి డిజైన్ మరియు ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.

Motorola Razr 50 5G, Razr 50 Ultra 5G రెండర్స్ (లీక్)

ప్రముఖ లీక్‌స్టర్ సుదాన్శు అంభోరే నుంచి 91మొబైల్స్ కి Motorola Razr 50 5G సిరీస్ యొక్క రెండర్స్ మరియు స్పెసిఫికేషన్స్ అందాయి.

రెండర్స్ ప్రకారం, రేజర్ 50 5జీ ఫోన్ గ్రే మరియు ఖాకీ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. మరోవైపు రేజర్ 50 అల్ట్రా ఫోన్ పీచ్ ఫజ్, గ్రీన్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

రెండు ఫోన్ల యొక్క కవర్ స్క్రీన్ ని గమనిస్తే, కెమెరా లెన్సెస్ కోసం సెపరేట్ కటౌట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం కెమెరా రింగ్స్ మాత్రమే ఉండగా, వాటి చుట్టూ ఏ విధమైన అమరిక లేదు.

అల్ట్రా మోడల్ లో కవర్ స్క్రీన్ భారీగా ఉంది. అలాగే బెజెల్స్ కూడా సన్నగా ఉన్నాయి.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రేజర్ 50 లో మెయిన్ స్క్రీన్ సన్నని బెజెల్స్ కలిగి ఉంది.

Motorola Razr 50 5G, Razr 50 Ultra 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

Motorola Razr 50 5G

మెయిన్ డిస్ప్లే: 6.9-ఇంచ్ పీఓఎల్ఈడీ స్క్రీన్, 1080*2640 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎస్‌జీఎస్ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్, ఎస్‌జీఎస్ లో మోషన్ బ్లర్ సర్టిఫికేషన్.

కవర్ డిస్ప్లే: 3.63 ఇంచ్ పీఓఎల్ఈడీ కవర్ డిస్ప్లే

కవర్ స్క్రీన్ కెమెరాలు: Motorola Razr 50 5G కవర్ స్క్రీన్ పై 50ఎంపి + 13ఎంపి కెమెరాలు ఉన్నాయి.

మెయిన్ స్క్రీన్ కెమెరా: Motorola Razr 50 5G మెయిన్ స్క్రీన్ పై 32 మెగా పిక్సెల్ కెమెరా ఇచ్చారు.

సాఫ్ట్‌వేర్: Motorola Razr 50 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ కానుంది.

ప్రాసెసర్: Motorola Razr 50 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300ఎక్స్ చిప్సెట్ ఉంటుంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.5GHz.

మెమొరీ: Motorola Razr 50 5G లో 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఉంటాయి. ఇతర మెమొరీ ఆప్షన్స్ కూడా ఉండవచ్చు.

బ్యాటరీ: Motorola Razr 50 5G లో 4200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఫాస్ట్ చార్జింగ్ కేపబులిటీతో వస్తుంది. ఇంకా కెపాసిటీ ఎంతో తెలియదు.