ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో Razr 50 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Motorola Razr 50 మరియు Motorola Razr 50 Ultra ఫోన్లు లాంచ్ కానున్నాయి. తాజాగా ఈ సిరీస్ చైనా లాంచ్ తేదీ ఖరారైంది. చైనాలో ఈ రేజర్ 50 సిరీస్ జూన్ 25వ తేదీన లాంచ్ అవుతోంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా కన్ఫర్మ్ చేసింది. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.
Motorola Razr 50 సిరీస్ లాంచ్ తేదీ
Motorola Razr 50 సిరీస్ చైనా లాంచ్ తేదీ ఖరారైంది. జూన్ 25వ తేదీన చైనాలో ఈ సిరీస్ లాంచ్ అవుతోంది. ఈ విషయాన్ని కంపెనీ ఒక టీజర్ తో అధికారికంగా ప్రకటించింది.
టీజర్ ఇమేజ్ లో ఫోన్ల యొక్క పేర్లను వెల్లడించలేదు. కానీ అవి రేజర్ 50 మరియు రేజర్ 50 అల్ట్రా అని భావిస్తున్నారు.
చైనాలో జరిగే Motorola Razr 50 సిరీస్ లాంచ్ ఈవెంట్ చైనా కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది.
Motorola Razr 50 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)
Motorola Razr 50 ఫోల్డబుల్ ఫోన్ లో 6.9-ఇంచ్ పీఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెస్ రేట్, 3.6-ఇంచ్ ఓఎల్ఈడీ సెకండరీ స్క్రీన్ ఉంటాయి.
Motorola Razr 50 లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300ఎక్స్ చిప్సెట్ ఉంటుందని గీక్‌బెంచ్ ద్వారా తెలిసింది.
Motorola Razr 50 స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వచ్చే అవకాశం ఉంది.
Motorola Razr 50 డివైజ్ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 4200 ఎంఏహెచ్ బ్యాటరీ తో వస్తున్నట్లు సమాచారం.
కెమెరా విభాగం చూస్తే, ఈ ఫోల్డబుల్ ఫోన్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ గల డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది.
మరోవైపు, Motorola Razr 50 Ultra లో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ తో వస్తోంది.
స్టాండర్డ్ మోడల్ తో పోల్చితే, అల్ట్రా మోడల్ ఆకర్షణీయమైన డిజైన్ తో రానున్నట్లు తెలుస్తోంది.
అల్ట్రా మోడల్ లో పవర్ బ్యాకప్ కోసం 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
