16GB ర్యామ్, 165Hz డిస్ప్లే, 125W చార్జింగ్ తో లాంచైన Moto X40

హైలైట్స్

  • చైనాలో లాంచైన Moto X40 స్మార్ట్ ఫోన్
  • Moto X30 కి సక్సెసర్ గా వచ్చిన Moto X40 డివైజ్
  • 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 165హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి ఓఐఎస్ కెమెరాతో వచ్చిన Moto X40

మోటోరోలా కంపెనీ తాజాగా తన ఫ్లాగ్షిప్ డివైజ్ Moto X40 ని చైనాలో లాంచ్ చేసింది. Moto X30 కి సక్సెసర్ గా Moto X40 మార్కెట్ లోకి వచ్చింది. టాప్ స్పెసిఫికేషన్స్ తో Moto X40 ని తీసుకొచ్చింది మోటోరోలా కంపెనీ. ఈ డివైజ్ భారత్ లో ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా కంపెనీ వెల్లడించలేదు. చైనాలో లాంచ్ అయ్యింది కాబట్టి, నెక్ట్స్ ఇండియా మరియు గ్లోబల్ మార్కెట్స్ లోకి Moto X40 ప్రవేశించడం ఖాయం. లాంచ్ తేదీని మోటోరోలా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

Moto X40 స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వచ్చింది. ఇందులో 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీని అందించారు. త్రీ-డైమెన్షనల్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, 6.7-ఇంచ్ డిస్ప్లే, 165హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు ఎన్నో ఉన్నాయి. పదండి, ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్ ని తెలుసుకుందాం.

Moto X40 స్పెసిఫికేషన్స్

Moto X40 స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్ హోల్ కెమెరా కటౌట్, కర్వ్డ్ ఎడ్జెస్, 10-బిట్ కలర్స్, హెచ్డీఆర్ సపోర్ట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి. Moto X40 లో చిన్నపాటి రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది. ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ ని ఈ ఫోన్ కలిగి ఉంది.

Moto X40 కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Moto X40 లో ట్రిపుల్ రియర్ కెమెరాలు ఉన్నాయి. ఇందులో 50 ఎంపి ఓఐఎస్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 12ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 60 ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 4కే హెచ్డీఆర్ వీడియో రికార్డింగ్, హారిజంటల్ లాక్ ఫీచర్ ఉంటాయి. యాక్షన్ సీన్స్ షూట్ చేసేప్పుడు ఈ హారిజంటల్ లాక్ ఫీచర్ ఉపయోగపడుతుంది.

Moto X40 లో 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ ఉంటాయి. త్రీ-డైమెన్షనల్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ని ఈ ఫోన్ లో అందించారు. పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి, 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మైయూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Moto X40 లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.3, డ్యూయల్-ఫ్రీక్వెన్సీ జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ డివైజ్ లో డాల్బి అట్మాస్ స్టీరియో స్పీకర్స్ అందించారు.

Moto X40 స్మోకీ బ్లాక్, టూర్మరైన్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Moto X40 ధర

Moto X40 8జిబి + 128జిబి వేరియంట్ ధర RMB 3399 (సుమారు రూ.40,300), 8జిబి+256జిబి మోడల్ ధర RMB 3699 (సుమారు రూ.44,900), 12జిబి+256జిబి యూనిట్ ధర RMB 3999 (సుమారు రూ.47,500), 12జిబి+512జిబి యూనిట్ ధర RMB 4299 (సుమారు రూ.51,000)

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous article240W ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న Realme GT Neo 5
Next article120హెర్ట్జ్ డిస్ప్లే, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి కెమెరాతో లాంచైన Moto G53
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.