‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ మూవీ OTT Update

హైలైట్స్

  • ఓటీటీ ప్రీమియర్ కి సిద్ధమైన నేను మీకు బాగా కావాల్సినవాడిని
  • అక్టోబర్ 14 నుంచి ఆహా ఓటీటీ లో ప్రసారం కానున్న సినిమా
  • కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్, సోనూ ఠాకూర్ ప్రధాన పాత్రధారులు

యువ నటుడు కిరణ్ అబ్బవరం ‘రాజావారు రాణిగారు’ చిత్రంతో తెరంగేట్రం చేసి మొదటి ప్రయత్నంలోనే విజయం అందుకున్నారు. తర్వాత వచ్చిన ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ చిత్రం కూడా ప్రేక్షకులను అలరించింది. అయితే ఈ సంవత్సరం వచ్చిన సెబాస్టియన్, సమ్మతమే చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇటీవలె కిరణ్, ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య ఈ చిత్రంతో నిర్మాతగా తెలుగు తెరకు పరిచయమయ్యారు.

ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం, వివేక్ అనే క్యాబ్ డ్రైవర్ పాత్రను పోషించారు. మందుకు బానిసైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని పాత్రలో కథానాయిక తేజు (సంజన ఆనంద్) నటించింది. పలు ట్విస్టులతో సాగే ఈ సినిమా కథ, ఇంట్లో కూర్చొని కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం. సస్పెన్స్, లవ్, మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. మణిశర్మ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ. కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఎస్వీ కృష్ణారెడ్డి, బాబా భాస్కర్ కీలక పాత్రల్లో మెప్పించారు.

సినిమాటోగ్రఫీ, సంగీతం, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు పెద్ద ప్లస్. మేకర్స్ కి ఇది తొలి సినిమా అయినప్పటికీ నిర్మాణ విలువలు బాగుండేలా చూసుకున్నారు. పెద్ద సినిమా లాగా చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరు బాగుంది.

బాక్సాఫీస్ పెర్ఫామెన్స్

కిరణ్ అబ్బవరం, సంజనా ఆనంద్, సోనూ ఠాకూర్ ప్రధాన పాత్రలు పోషించిన నేను మీకు బాగా కావాల్సినవాడిని చిత్రం తొలిరోజు వసూళ్ళు పర్వాలేదనిపించాయి. అయితే తర్వాత రోజు నుంచి ఈ సినిమా థియేటర్లలో నిలవలేక పోయింది. దీంతో త్వరగానే నేను మీకు బాగా కావాల్సినవాడిని చిత్రం తన థియెట్రికల్ రన్ ముగించుకుంది.

నేను మీకు బాగా కావాల్సినవాడిని మూవీ OTT అప్డేట్

థియేటర్ రిలీజెస్ తో పాటు ఓటీటీ ప్రీమియర్స్ కి కూడా ఇటీవలి కాలంలో డిమాండ్ ఏర్పడింది. థియేటర్లలో సినిమాను చూడని ప్రేక్షకులు, ఓటీటీ ప్రీమియర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నేను మీకు బాగా కావాల్సినవాడిని చిత్రం ఓటీటీ అప్డేట్ రానే వచ్చింది. కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో తో పాటు ఆహా ఓటీటీ లో కూడా ప్రసారం కానుంది. అక్టోబర్ 14 నుంచి ఈ రెండు ఓటీటీ ల్లో నేను మీకు బాగా కావాల్సినవాడిని చిత్రం ప్రీమియర్ అయ్యేందుకు సిద్ధమైంది.

మరో రెండు రోజుల్లో ప్రసారం కానున్న నేను మీకు బాగా కావాల్సినవాడిని చిత్రాన్ని మీ అభిమాన ఓటీటీ లైన అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా ల్లో చూసి ఆనందించండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

Previous articleలాంచ్ కి ముందు లీకైన Lava Storm, Lava Storm Pro స్పెసిఫికేషన్స్
Next articleభారత్ లో లాంచ్ అయిన Nokia G11 Plus
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.