మహారాష్ట్రలో రోడ్లపై కి టెస్టింగ్ కి వచ్చిన Nissan Ariya e-SUV కెమెరా కంటికి చిక్కింది. దీంతో Nissan Ariya e-SUV యొక్క ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. త్వరలోనే ఈ కారు భారత మార్కెట్ లో లాంచ్ కానుంది. అంతర్జాతీయ మార్కెట్ లో ఇప్పటికే అందుబాటులో ఉన్న Nissan Leaf EV కి పైన Nissan Ariya e-SUV ఉంటుంది.
Renault, Nissan కలిసి భారత మార్కెట్ లో రూ.5,300 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సదరు సంస్థలు ప్రకటించాయి. అలాగే ఇరు సంస్థలు కలిసి కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను 2025 తర్వాత భారత్ లో లాంచ్ చేయనున్నట్లు స్పష్టం చేసాయి.
Nissan Ariya e-SUV
Nissan Ariya e-SUV కారు Hyundai IONIQ 5 మరియు Kia EV6 వంటి కార్లతో అంతర్జాతీయ మార్కెట్స్ లో పోటీపడనుంది. ఇకపోతే Hyundai IONIQ, Kia EV6 కార్లు ఇప్పటికే భారత్ లో లాంచ్ అయ్యాయి. అలాగే వీటికి కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అందువల్లన జపనీస్ కార్ మేకర్ అయిన నిస్సాన్ భారత్ లో Nissan Ariya e-SUV ని లాంచ్ చేసిన రెస్పాన్స్ ఎలా ఉండనుందో చూస్తే మంచిది. అయితే, Nissan Ariya e-SUV లాంచ్ టైమ్‌లైన్ ని ఇంకా నిస్సాన్ ప్రకటించలేదు.
Nissan Ariya e-SUV రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో లభించనుంది. అవి: 63కిలోవాట్ అవర్ మరియు 87కిలోవాట్ అవర్. 63kWh బ్యాటరీ ప్యాక్ ని 217హెచ్‌పి పవర్, 300 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేసే మోటర్ కి అనుసంధానించారు. ఇది సింగిల్ చార్జ్ పై 402 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. 87kWh బ్యాటరీ ప్యాక్ ని 242హెచ్‌పి పవర్, 300ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేసే మోటర్ కి అనుసంధానించారు. ఇది సింగిల్ చార్జ్ పై 529 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. నిస్సాన్ సంస్థ 306హెచ్‌పి, 600ఎన్ఎం టార్క్ గల బ్యాటరీ ప్యాక్ తో మరొక టాప్ మోడల్ ని కూడా అభివృద్ధి చేస్తోంది.
Nissan Ariya e-SUV లో 12.3-ఇంచ్ భారీ తెర, బోస్ ప్రీమియమ్ సౌండ్ సిస్టమ్, హెడ్-అప్ డిస్ప్లే, 19-ఇంచ్ లేదా 20-ఇంచ్ వీల్స్, ఒక ఇల్యూమినేటెడ్ నిస్సాన్ లోగో, ఎల్ఈడీ లైటింగ్, డ్రైవర్ అసిస్టన్స్ ఫీచర్స్ తో వస్తోంది. Euro NCAP క్రాష్ టెస్ట్ లో Nissan Ariya e-SUV కి 5-Star రేటింగ్ వచ్చింది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
