Nokia 105 4G (2023) స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచైంది. ఈ ఫోన్ క్లాసిక్ క్యాండీ బార్ డిజైన్ తో వచ్చింది. అసలైతే, గతేడాది కంపెనీ ఈ హ్యాండ్సెట్ ని పరిచయం చేసింది. కానీ, ఈసారి ఎక్కువ బ్యాటరీ కెపాసిటీతో ఫోన్ ని తీసుకొచ్చింది. ఈ బ్యాటరీ గత మోడల్ బ్యాటరీ కంటే ఎక్కువ లైఫ్ ని అవ్వనుంది. Nokia 105 4G (2023) కి సంబంధించిన ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.
Nokia 105 4G (2023) ధర
Nokia 105 4G (2023) డివైజ్ చైనీస్ మార్కెట్ లో అలీపే సపోర్ట్ తో లాంచైంది. మరోవైపు, ఈ ఫోన్ ధర 229 యువాన్లు (సుమారు రూ.2,700) గా ఉంది. అయితే, ఈ హ్యాండ్సెట్ లాంచ్ ఆఫర్ లో భాగంగా 199 యువాన్లు (సుమారు రూ.2,350) కే లభిస్తుంది.
Nokia 105 4G (2023) స్పెసిఫికేషన్స్
- Nokia 105 4G (2023) లో 1.8-ఇంచ్ క్యూవీజీఏ కలర్ డిస్ప్లే ఉంది.
ఈ డివైజ్ 4జీ వొల్టీ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. - పాత Nokia 105 4G తో పోల్చితే, కొత్త వర్షన్ 1450 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చింది.
- ఈ ఫోన్ లో 32జిబి వరకు స్టోరేజీని ఎక్స్ప్యాండ్ చేసుకునే వీలుంది.
- ఈ డివైజ్ లో బ్లూటూత్ 5.0 మరియు 3.5ఎంఎం ఆడియో జాక్, మైక్రోయూఎస్బీ 2.0 పోర్ట్ ఉన్నాయి.
- Nokia 105 4G (2023) మరియు పాత వర్షన్ డివైజ్ యూనిసాక్ టీ107 చిప్, 128ఎంబి ర్యామ్ ని కలిగి ఉన్నాయి.
- అదనంగా ఈ ఫోన్ బోల్డ్ బటన్ ఫాంట్స్, బ్లాక్ మరియు బ్లూ కలర్స్ లో అందుబాటులో ఉంది.
బ్యాటరీలో మార్పు తప్పితే, ఈ కొత్త ఫోన్ లో క్లాసిక్ క్యాండీ బార్ డిజైన్ మరియు బటన్స్ ఉన్నాయి. పెద్దవారికి ఈ ఫోన్ బాగా ఉపయోగపడుతుంది. ఇక విద్యార్థులకు, ఇతరులకు ఎవరికైనా సరే ఈ ఫోన్ బ్యాకప్ డివైజ్ గా సరైన ఎంపిక అని చెప్పవచ్చు. Nokia 105 4G (2023) డివైజ్ లో హెచ్ఐఏ ఫీచర్ హైలైట్ గా నిలుస్తోంది. ఇంకా అలీపే కి త్వరితగతిన యాక్సెస్ లభిస్తుంది. పేమెంట్ కోడ్ పై క్లిక్ చేసి పేమెంట్ క్యూఆర్ కోడ్ లేదా బార్ కోడ్ ని యాక్సెస్ చేయవచ్చు.
భారత్ లో Nokia 105 4G (2023) ఫోన్ ఎప్పుడు లాంచ్ కానుంది?
Nokia 105 4G (2023) స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతుందో లేదో ఇంకా తెలియదు. లాంచ్ కి సంబంధించిన సమాచారం కంపెనీ వెల్లడించలేదు. కానీ, ఈ ఫోన్ భారత్ కి వస్తుందని అంచనా వేయవచ్చు. ప్రస్తుతం Nokia 105 4G ఓల్డ్ వర్షన్ భారత్ లో అందుబాటులో ఉంది. ఈ వేరియంట్ కూడా సేమ్ స్పెసిఫికేషన్స్ ని కలిగి ఉంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
