హైలైట్స్:
- నోకియా 2660 ఫ్లిప్ ని లాంచ్ చేసిన నోకియా కంపెనీ
- నోకియా 2660 ఫ్లిప్ ఫోన్ ధర 429 యువాన్లు (దాదాపు రూ.5876)
- భారత్ లో ఫోన్ లభ్యతపై ఇంకా రాని స్పష్టత
నోకియా 2660 ఫ్లిప్ చైనా మార్కెట్ లో లాంచ్ అయ్యింది. దీని ధరను 499 యువాన్లు గా నిర్ణయించారు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.5876. అయితే ప్రస్తుతం ఆఫర్ తో ఈ ఫోన్ 429 యువాన్లు (రూ.5052) కి లభిస్తోంది. ఇక ఈ ఫోన్ భారత్ లో ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా స్పష్టత లేదు. చాలా రోజుల తర్వాత నోకియా కంపెనీ నుంచి ఫ్లిప్ ఫోన్ రావడం విశేషం. ఈ ఫోన్ నోకియా ఏలిన మునుపటి రోజులను గుర్తు తెస్తోంది.
Nokia 2660 Flip స్పెసిఫికేషన్స్
నోకియా 2660 ఫ్లిప్ యొక్క ఫీచర్లను గురించి తెలుసుకుందాం. 2.8 అంగుళాల క్యూవీజీఏ డిస్ప్లే ను కలిగి ఉంది. 240*320 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఇందులో ఉంది. ఈ ఫోన్లో 1.77 అంగుళాల సెకండరీ క్యూవీజీఏ డిస్ప్లే ఉండటం విశేషం. దీని రెజుల్యూషన్ 120*160 పిక్సెల్స్. యూనిసాక్ టీ107 ప్రాసెసర్ ను ఈ ఫోన్ లో ఉపయోగించారు.
ఇప్పుడు ర్యామ్, స్టోరేజీ వివరాలు చూద్దాం. ఈ ఫోన్లో 48ఎంబి ర్యామ్, 128ఎంబి స్టోరేజీని అందించారు. ఈ ఫోన్లో 0.3 మెగాపిక్సెల్/వీజీఏ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ అందించారు. బ్లూటూత్ 4.2, డ్యూయల్ సిమ్ సపోర్ట్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, మైక్రో యూఎస్‌బి పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. నోకియా 2660 ఫ్లిప్ లో 2.75 వాట్-అవర్ రిమూవబుల్ బ్యాటరీ ఉన్నాయి. 20 గంటల వరకు బ్యాటరీ లైఫ్, 26.6 రోజుల స్టాండ్ బై టైమ్ ని ఈ ఫోన్ కలిగి ఉన్నట్లు కంపెనీ చెబుతోంది.
ఇప్పుడు సాఫ్ట్‌వేర్ గురించి తెలుసుకుందాం. ఐసీఈ ఎమర్జెన్సీ కాల్ సిస్టమ్ ఈ ఫోన్లో ఉంది. ఈ ఫోన్ పొడవు 18.9ఎంఎం, వెడల్పు 108ఎంఎం, మందం 55ఎంఎం, బరువు 123 గ్రాములు.
నోకియా ఇటీవలె భారత్ లో Nokia 8210 4G ఫీచర్ ఫోన్ ని లాంచ్ చేసింది. 27 రోజుల బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉండటం ఈ ఫోన్ ప్రత్యేకత. దృఢమైన బాడీ, ఎక్కువ రోజులు నడిచే బ్యాటరీ తో వచ్చిన ఈ ఫీచర్ ఫోన్ 1999 లో నోకియా నుంచి వచ్చిన నోకియా 8210 మోడల్ కి ఇది లేటెస్ట్ వర్షన్. పాత మోడల్ లో 2జీ నెట్వర్క్ మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ, లేటెస్ట్ మోడల్ లో 4జీ కనెక్టివిటీ ఉంది. ఇక ఫోన్ యొక్క ఇతర ఫీచర్ల గురించి చూస్తే, ఫోన్ లో యూనిసాక్ టీ107 చిప్సెట్ ను అమర్చారు. 48ఎంబి ర్యామ్ ఉంటుంది. దీంతో పాటు, ఫోన్లో డ్యూయల్ సిమ్ సపోర్ట్ కూడా ఉంది.
ఈ ఫోన్ ని మీరు రూ.3,999 కి కొనుగోలు చేయవచ్చు. డార్క్ బ్లూ, రెడ్ షేడ్స్ అనే రెండు రంగుల్లో ఈ ఫోన్ లభించనుంది. ఈ-కామర్స్ సైట్ అమెజాన్ కాకుండా, నోకియా స్టోర్ నుంచి ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. ఫోన్ పై కంపెనీ, ఒక సంవత్సరం రీప్లేస్మెంట్ గ్యారంటీని ఇస్తోంది.