Home News డ్యూయల్ స్క్రీన్స్ తో లాంచ్ అయిన Nokia ఫోన్

డ్యూయల్ స్క్రీన్స్ తో లాంచ్ అయిన Nokia ఫోన్

హైలైట్స్:

హెచ్ఎండీ గ్లోబల్ బ్రాండ్ అయిన నోకియా భారత్ లో కొత్త ఫీచర్ ఫోన్ నోకియా 2660 ఫ్లిప్ ని లాంచ్ చేసింది. ఫీచర్ ఫోన్ మార్కెట్ లో ఈ ఫోన్ సదరు కంపెనీ స్థానాన్ని మరింత బలపరచనుంది. 2022 రెండో త్రైమాసికం వరకు ఫీచర్ ఫోన్ అమ్మకాల్లో నోకియా రెండో స్థానంలో ఉంది. నోకియా 2660 ఫ్లిప్, పేరులో ఉన్నట్లుగానే, నిలువుగా మడతబెట్టే ఫోన్. ఓ చిన్న కవర్ డిస్ప్లే ఈ ఫోన్ పైన ఉంటుంది. దీని ద్వారా నోటిఫికేషన్స్ ని చూసుకోవచ్చు. అలాగే 2.8 అంగుళాల క్యూవీజీఏ మెయిన్ డిస్ప్లే లోపల ఉంటుంది. కాగా, యూనిసాక్ టీ107 4జీ చిప్సెట్ ని ఇందులో అమర్చారు. 1450 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.

భారత్ లో Nokia 2660 Flip ధర, లభ్యత వివరాలు

నోకియా 2660 ఫ్లిప్ ఫోన్ ధర భారత్ లో రూ.4699 గా ఉంది. కొనాలనే ఆసక్తి ఉన్నవారు రిటైల్ స్టోర్స్, నోకియా అధికార వెబ్ సైట్, ఈ-కామర్స్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. నోకియా 2660 ఫ్లిప్ ఫోన్ బ్లూ, రెడ్, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది.

Nokia 2660 Flip స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

నోకియా 2660 ఫ్లిప్ ఫోన్లో 2.8 అంగుళాల క్యూవీజీఏ డిస్ప్లే, 1.77 అంగుళాల కవర్ ప్యానెల్ ఉన్నాయి. ఈ కవర్ ప్యానెల్ టచ్ స్క్రీన్ కాదు, కానీ దీని ద్వారా టైమ్, డేట్, మిగతా అలర్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఇకపోతే ఈ ఫోన్లో యూనిసాక్ టీ107 చిప్సెట్, 1450ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఈ ఫోన్ 20 రోజుల స్టాండ్ బై టైమ్ కలిగి ఉంటుందని నోకియా చెబుతోంది. నోకియా 2660 ఫ్లిప్ లో 48ఎంబి ర్యామ్, 128ఎంబి స్టోరేజీ, 32జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజీ ఉన్నాయి.

నోకియా 2660 ఫ్లిప్ లో వీజీఏ 0.3 ఎంపి సింగిల్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. 3.5ఎంఎం హెడ్ఫోన్ జాక్, మైక్రో యూఎబీ 2.0 పోర్ట్, బ్లూటూత్ 4.2, 2.75వాట్ చార్జింగ్ సపోర్ట్, ఎస్30+ ఓఎస్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

ఈ నోకియా ఫీచర్ ఫోన్ సీనియర్ సిటిజన్లకు ఎంతో ఉత్తమమైనది. ఎందుకంటే ఇందులో హియరింగ్ ఎయిడ్ కంపాటిబిలిటీ, నేవిగేషన్ కొరకు టాక్టైల్ బటన్స్, స్క్రీన్ ని తేలికగా చదివేందుకు జూమ్-ఇన్ ఇంటర్ఫేస్, టీ9 కీబోర్డ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. నోకియా 2660 ఫ్లిప్ ఫోన్ పై ఎవరైనా టైప్ చేస్తే, క్రిస్టల్ క్లియర్ సౌండ్ వినిపిస్తోంది. ఇక ఈ ఫోన్ వినోదం కొరకు ఎఫ్ఎం రేడియో, ఎంపీ3 ప్లేయర్ లను కలిగి ఉంది.

లేటెస్ట్ మొబైల్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ వార్తల కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.