HMD: త్వరలో లాంచ్ కానున్న Nokia 3210 4G, HMD Pulse+, HMD T21 Tablet

Highlights

  • త్వరలో HMD డివైజెస్ లాంచ్
  • లైనప్ లో వస్తోన్న HMD T21 ట్యాబ్
  • Nokia ఫోన్లు లాంచ్ అయ్యే అవకాశం

HMD సంస్థ ఇప్పటికే తన బ్రాండ్ ఫోన్లను లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటన చేసింది. ఈ ఉత్పత్తులు భారత్ తో సహా ఇతర మార్కెట్స్ లో లాంచ్ కానున్నాయి. ఈ డివైజెస్ లో ఒక ఫ్లిప్ ఫోన్ కూడా ఉంది. వీటితో పాటు Nokia బ్రాండ్ ఫోన్లు కూడా లాంచ్ కానున్నాయి. ఇక కొన్ని రోజుల క్రితం ఐఎంఈఐ డేటాబేస్ పై HMD కి సంబంధించిన 9 ఫోన్లు లిస్ట్ అయ్యాయి. ఇప్పుడు వీటిలో నుంచి కొన్ని డివైజెస్ యొక్క పేర్లు మరియు హార్డ్‌వేర్ వివరాలు, కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

త్వరలో లాంచ్ కాబోయే HMD ఫోన్ల జాబితా

Nokia 3210 4G: లిస్ట్ లో ఉన్న మొదటి ఫోన్ ఇదే. దీన్ని టిప్‌స్టర్ ముకుల్ శర్మ షేర్ చేశారు. ఐకానిక్ నోకియా 3210 ని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నంలో కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ స్కూబా బ్లూ, గ్రంజ్ బ్లాక్ మరియు వై2కే గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Nokia 225 4G: లిస్ట్ లో ఉన్న రెండో ఫోన్ Nokia 225 4G. ఈ డివైజ్ పింక్ మరియు డార్క్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అలాగే Nokia 235 4G ఫోన్ కూడా లాంచ్ కానుంది.

HMD T21 Tablet: హెచ్ఎండీ నుంచి ఒక ట్యాబ్లెట్ లాంచ్ కానుందని గతంలో వార్తలు వినిపించాయి. కంపెనీ విడుదల చేసిన అధికార టీజర్ లో కూడా ట్యాబ్లెట్ గ్లిమ్స్ ని చూపించారు.

HMD Pulse+: HMD Pulse+ స్మార్ట్‌ఫోన్ 6జిబి ర్యామ్/128జిబి స్టోరేజీ ఆప్షన్ లో లాంచ్ అవుతుందని సమాచారం. ఈ ఫోన్ 6.56-ఇంచ్ డిస్ప్లే, మిడ్నైట్ బ్లూ కలర్ ఆప్షన్ లో లభిస్తుంది.

HMD Pulse Pro: HMD Pulse Pro డివైజ్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్ లో లభిస్తుంది. ఈ హ్యాండ్సెట్ ట్విలైట్ పర్పుల్, బ్లాక్ ఓషన్ మరియు గ్లేవియర్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

HMD Legend, Legend+ మరియు Legend Pro ఫోన్లు కూడా అభివృద్ధి దశలో ఉన్నాయి. ఇకపోతే, HMD Pulse Pro టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై TA-1595 మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఈ సర్టిఫికేషన్ ద్వారా మరే ఇతర వివరాలు రివీల్ కాలేదు.