Nokia కంపెనీ అధికారికంగా కొత్త సీ-సిరీస్ ఫోన్ ని లాంచ్ చేసింది. Nokia C02 పేరుతో వచ్చిన ఈ ఫోన్ 5.45-ఇంచ్ డిస్ప్లే, బాక్సీ డిజైన్ ని కలిగి ఉంది. UniSoC ప్రాసెసర్ ని ఈ డివైజ్ లో వాడారు. 2జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ అందించారు. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 5 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. సరే, ఓసారి Nokia C02 యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
Nokia C02 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్
Nokia C02 స్మార్ట్ ఫోన్ లో 5.45-ఇంచ్ డిస్ప్లే, 480 x 960 పిక్సెల్ రెజుల్యూషన్, 18:9 యాస్పెక్ట్ రేషియో ఉంటాయి. ఈ ఫోన్ లో క్వాడ్-కోర్ UniSoC ప్రాసెసర్ వాడారు. ఈ డివైజ్ 2జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ తో వచ్చింది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 256జిబి వరకు పెంచుకోవచ్చు. Nokia C02 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ పై పని చేస్తుంది.
Nokia C02 స్మార్ట్ ఫోన్ లో 5ఎంపి సింగిల్ రియర్ కెమెరా ఉంటుంది. దీనికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 2 ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ డివైజ్ ఐపీ52 రేటింగ్ తో రావడం విశేషం. ఈ ఫోన్ లో 3.5 ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎం రేడియో సపోర్ట్ ఉన్నాయి.
Nokia C02 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ సిమ్, 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 4.2, జీపీఎస్, మైక్రోయూఎస్బీ పోర్ట్ ఉంటాయి. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ లో 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 5 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Nokia C02 డివైజ్ 148.7 మిల్లీ మీటర్ల పొడవు, 71.2 మిల్లీ మీటర్ల వెడల్పు, 10ఎంఎం మందం, 191 గ్రాముల బరువు ఉంటుంది.
Nokia C02 స్మార్ట్ ఫోన్ డార్క్ సైయన్, చార్కోల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఇంకా నోకియా ఈ ఫోన్ యొక్క ధర, లభ్యత వివరాలను ప్రకటించాల్సి ఉంది.
గతంలో నోకియా సంస్థ బడ్జెట్ ఓరియంటెడ్ సీ-సిరీస్ స్మార్ట్ ఫోన్ Nokia C01 Plus ని 2021 లో లాంచ్ చేసింది. ఈ డివైజ్ 5.45-ఇంచ్ డిస్ప్లే, 720*1440 పిక్సెల్స్ రెజుల్యూషన్ తో వచ్చింది. ఇక కొత్తగా లాంచైన Nokia C02 డివైజ్ Nokia C01 డిజైన్ ని పోలి ఉంది. త్వరలోనే Nokia C02 స్మార్ట్ ఫోన్ ధర, లభ్యత వివరాలను కంపెనీ ప్రకటించనుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
