Home News UniSoc ప్రాసెసర్, 3000mAh బ్యాటరీతో లాంచైన Nokia C12

UniSoc ప్రాసెసర్, 3000mAh బ్యాటరీతో లాంచైన Nokia C12

Highlights
  • 6.3-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే తో లాంచైన Nokia C12 స్మార్ట్ ఫోన్
  • 8ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి ఫ్రంట్ కెమెరాతో వచ్చిన Nokia C12
  • లైట్ మింట్, డార్క్ సైయన్, చార్‌కోల్ కలార్ ఆప్షన్స్ లో లభించనున్న డివైజ్

నోకియా కంపెనీ సీ-సిరీస్ లో ఒక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. దాని పేరు: Nokia C12. ఈ ఫోన్ యూరోపియన్ మార్కెట్ లో యూనిసాక్ ప్రాసెసర్ తో లాంచైంది. Nokia C12 లో భారీ డిస్ప్లే, హెచ్డీ+ రెజుల్యూషన్, 5ఎంపి కెమెరా ఉన్నాయి.

Nokia C12 లో 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, 5 వాట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ లో 8ఎంపి ప్రైమరీ కెమెరా, ఐపీ52 రేటింగ్ ఉన్నాయి. Nokia C12 యొక్క ధర, స్పెసిఫికేషన్స్, లభ్యత తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Nokia C12 ధర, లభ్యత

Nokia C12 స్మార్ట్ ఫోన్ 2జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర 110 యూరోలు (సుమారు రూ.10,500) గా ఉంది. త్వరలోనే ఈ ఫోన్ జర్మనీ, ఆస్ట్రియా దేశాల్లో అందుబాటులోకి వస్తుంది. తర్వాత ఇతర యూరోపియన్ దేశాల్లోకి కూడా ప్రవేశించనుంది. Nokia C12 ఇండియా లాంచ్ గురించి కంపెనీ నుంచి ఇంకా ప్రకటన రావాల్సి ఉంది.

Nokia C12 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

Nokia C12 స్మార్ట్ ఫోన్ లో 6.3-ఇంచ్ డిస్ప్లే, హెచ్డీ+ (1600*720 పిక్సెల్స్) రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ ఉన్నాయి.

Nokia C12 స్మార్ట్ ఫోన్ లో యూనిసాక్ ఎస్‌సీ9863ఏ ఆక్టాకోర్ ప్రాసెసర్ వాడారు. ఇందులో గ్రాఫిక్స్ కోసం ఐఎంజీ8322 జీపీయూ వినియోగించారు. 2జిబి ర్యామ్, 64జిబి ఈఎంఎంసీ 5.1 స్టోరేజీని ఇందులో అందించారు. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా యూజర్లు మెమొరీని పెంచుకోవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ పై పని చేస్తుంది. Nokia C12 ఫోన్ కి రెండేళ్ళ పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ వస్తాయి.

Nokia C12 లో 8ఎంపి సింగిల్ రియర్ కెమెరా ఉంటుంది. ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. భద్రత కోసం ఈ ఫోన్ లో ఫేస్ అన్‌లాక్ ఫీచర్ అందించారు.

Nokia C12 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది రిమూవబుల్ బ్యాటరీ. 5 వాట్ చార్జింగ్ సపోర్ట్, మైక్రో యూఎస్బీ పోర్ట్ అందించారు. Nokia C12 లో 3.5 ఎంఎం ఆడియో జాక్, ఐపీ52 రేటింగ్ ఉన్నాయి.

Nokia C12 ఫోన్ డార్క్ సైయన్, లైట్ మింట్, చార్‌కోల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 160.6 మిల్లీ మీటర్ల పొడవు, 74.3 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.75 మిల్లీ మీటర్ల మందం, 177.4 గ్రాముల బరువు ఉంటుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే ఇందులో డ్యూయల్-సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్, గ్లొనాస్ వంటివి ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.