భారత్ లో నోకియా బ్రాండ్ ఒక కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. Nokia C12 Plus లాంచ్ తో కంపెనీ తన సీ-సిరీస్ ని విస్తరింపజేసింది. Nokia C12 Plus కంటే ముందు, నోకియా సంస్థ భారత్ లో సీ12, సీ12 ప్రో ఫోన్లను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో అత్యంత ప్రీమియమ్ ఆప్షన్ గా Nokia C12 Plus మార్కెట్ లోకి వచ్చింది. ఇది సింగిల్ స్టోరేజీ వేరియంట్ లో అందుబాటులోకి వచ్చింది.
Nokia C12 Plus స్మార్ట్ ఫోన్ 6.3-ఇంచ్ డిస్ప్లే, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ తో లాంచైంది. సరే, ఓసారి Nokia C12 Plus డివైజ్ ధర, ఫీచర్స్ ఇతర స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
భారత్ లో Nokia C12 Plus ధర
Nokia C12 Plus 2జిబి ర్యామ్ ఆప్షన్ తో భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 32జిబి స్టోరేజీని కలిగి ఉంది. మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ తో మెమొరీని 256జిబి వరకు పెంచుకోవచ్చు. భారత్ లో Nokia C12 Plus ధరను రూ.7,999 గా నిర్ణయించారు.
Nokia C12 ధర చూస్తే రూ.5,999 గా ఉంది. మరోవైపు Nokia C12 Pro డివైజ్ ధర రూ.6,999 గా ఉంది. Nokia C12 Plus డార్క్ సైయన్, చార్కోల్ మరియు లైట్ మింట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Nokia C12 Plus స్పెసిఫికేషన్స్
- 6.3-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే
- 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
- 2జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ
- 4000 ఎంఏహెచ్ బ్యాటరీ
- 10 వాట్ చార్జింగ్
- 3.5ఎంఎం ఆడియో జాక్
Nokia C12 Plus లో సింగిల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. ఇందులో 8ఎంపి మెయిన్ కెమెరా ఉంది. దీనికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఇచ్చారు. ఇక సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. వాటర్ డ్రాప్ నాచ్ లో ఫ్రంట్ కెమెరా ఉంటుంది. Nokia C12 Plus లో 6.3-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 720*1512 పిక్సెల్స్ రెజుల్యూషన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
Nokia C12 Plus డివైజ్ లో యూనిసాక్ ఎస్‌సీ9863ఏ1 చిప్సెట్ వాడారు. ఇదొక ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్. ఈ ఫోన్ లో 2జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ అందించారు. Nokia C12 Plus డివైజ్ ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ పై పని చేస్తుంది. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. మైక్రోఎస్డీ 2.0 పోర్ట్ ని ఈ ఫోన్ లో అందించారు.
Nokia C12 Plus లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండదు. కానీ 3.5ఎంఎం ఆడియో జాక్, సింగిల్ స్పీకర్, బ్లూటూత్ 5.2, వై-ఫై ఉంటాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
