హైలైట్స్
- భారత్ లో లాంచైన ఎంట్రీ లెవెల్ ఫోన్ Nokia C31
- 2022 సెప్టెంబర్ లో గ్లోబల్ గా లాంచైన Nokia C31
- భారత్ లో రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచైన Nokia C31
నోకియా కంపెనీ ఒక కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. Nokia C31 నేడు భారత్ లో లాంచైంది. 2022 సెప్టెంబర్ లో Nokia C31 గ్లోబల్ గా లాంచైంది. రెండు స్టోరేజీ వేరియంట్స్ లో Nokia C31 లభిస్తుంది.
Nokia C31 లో లో-బడ్జెట్ ఫోన్లలో కనిపించే స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. యూనిసాక్ ప్రాసెసర్ ని ఈ ఫోన్ కలిగి ఉంది. ఇంకా 6.7-ఇంచ్ హెచ్డీ డిస్ప్లే, 3-డే బ్యాటరీ లైఫ్, ఏఐ-పవర్డ్ బ్యాటరీ సేవింగ్ ఫీచర్స్, ఆండ్రాయిడ్ 12, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, సెల్ఫీ కెమెరా ఇతర ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. Nokia C31 యొక్క భారత మార్కెట్ ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, సేల్స్ తేదీ తదితర వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
భారత్ లో Nokia C31 ధర, సేల్ తేదీ
Nokia C31 భారత్ లో రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచైంది. బేస్ వేరియంట్ 3జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ధర రూ.9,999 గా నిర్ణయించారు. ఇక 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ దర రూ.10,999 గా ఉంది. Nokia C31 స్మార్ట్ ఫోన్ చార్‌కోల్, మింట్, సైయన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Nokia C31 యొక్క సేల్ తేదీని కంపెనీ వెల్లడించలేదు. అయితే నోకియా వెబ్ సైట్ తో పాటు, ఇతర మేజర్ రిటైల్ స్టోర్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. త్వరలోనే ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ లో కూడా సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
Nokia C31 స్పెసిఫికేషన్స్
Nokia C31 లో 6.7-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ ఉంటాయి. Nokia C31 లో యూనిసాక్ ప్రాసెసర్ వాడారు. అయితే చిప్ పేరేంటో కంపెనీ తెలపలేదు. 4జిబి/3జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో ఫోన్ లభిస్తుంది. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ లో 5050 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. సింగిల్ చార్జ్ తో ఫోన్ 3 రోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. బ్యాటరీ లైఫ్ ని సేవ్ చేయడం కోసం ఏఐ-పవర్డ్ టెక్నాలజీని వాడినట్లు కంపెనీ అంటోంది.
Nokia C31 కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Nokia C31 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. గూగుల్ అందించిన కెమెరా యాప్ లో పొట్రెయిట్ మోడ్, హెచ్డీఆర్, నైట్ మోడ్, స్టోరేజీ స్మార్ట్స్ తదితర ఫీచర్స్ ఉంటాయి. ఇందులో ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది.
Nokia C31 డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది. భద్రత కోసం ఈ డివైజ్ లో ఫేస్ అన్ లాక్ ఫీచర్ అందించారు. ఈ ఫోన్ లో ఐపీ52 రేటింగ్ కూడా ఉంది. ఏడాది రీప్లేస్మెంట్ గ్యారంటీని కంపెనీ అందిస్తోంది. ఇంకా ఈ ఫోన్ లో బ్లూటూత్, 3.5ఎంఎం జాక్, వైఫై, మైక్రో యూఎస్బీ పోర్ట్, జీపీఎస్, ఏజీపీఎస్, గెలీలియో, ఎల్టీఈ ఫీచర్లు ఉన్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.