Home News భారత్ లో లాంచ్ అయిన Nokia G11 Plus

భారత్ లో లాంచ్ అయిన Nokia G11 Plus

హైలైట్స్

HMD Global సంస్థ నేడు భారత్ లో బ్రాండ్ న్యూ స్మార్ట్ ఫోన్ Nokia G11 Plus ని లాంచ్ చేసింది. ఈ నోకియా ఫోన్ 50 మెగా పిక్సెల్ కెమెరా, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4జిబి ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగి ఉంది. భారత్ లో ఈ ఫోన్ ధరను రూ.12,499 గా నిర్ణయించారు. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో Nokia G11 Plus స్మార్ట్ ఫోన్, OPPO A17, Vivo Y16 ఫోన్లకు పోటీ ఇవ్వనుంది.

Nokia G11 Plus స్పెసిఫికేషన్స్

Nokia G11 Plus స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Nokia G11 Plus లో 6.51-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 720*1600 పిక్సెల్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి. Nokia G11 Plus పాలికార్బొనేట్ బాడీ పై తయారైంది. ఈ ఫోన్ 164.8 మిల్లీ మీటర్ల పొడవు, 75.9 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.55 మిల్లీ మీటర్ల మందం, 192 గ్రాముల బరువు ఉంటుంది.

Nokia G11 Plus ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది. 2 ఏళ్ళ పాటు ఓఎస్ అప్డేట్స్ అందిస్తామని కంపెనీ హామీ ఇస్తోంది. అలాగే అతి త్వరలో ఆండ్రాయిడ్ 13 ఓఎస్ కి ఈ ఫోన్ అప్డేట్ అవ్వనుంది. ఇకపోతే Nokia G11 Plus లో యూనిసాక్ టీ606 చిప్సెట్ అమర్చారు. Nokia G11 Plus స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ తో వస్తోంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 512జిబి వరకు పెంచుకునే ఆప్షన్ ఉంది.

Nokia G11 Plus లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందు వైపున 8 మెగా పిక్సెల్ కెమెరా ఉంది.

Nokia G11 Plus ఫోన్ డ్యూయల్ సిమ్ 4జీ ఎల్టీఈ సపోర్ట్ కలిగి ఉంది. 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ ఐపీ52 రేటింగ్ తో వస్తుండటం విశేషం. పవర్ బ్యాకప్ కోసం Nokia G11 Plus లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Nokia G11 Plus ఫోన్ లేక్ బ్లూ, చార్‌కోల్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. కాగా, ఈ ఫోన్ ధర రూ.12,499.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.