Home News రూ.12,499 ధరతో లాంచ్ అయిన Nokia G11 Plus స్మార్ట్ ఫోన్

రూ.12,499 ధరతో లాంచ్ అయిన Nokia G11 Plus స్మార్ట్ ఫోన్

హైలైట్స్:

Nokia బ్రాండ్ యజమాని అయిన HMD Global నేడు భారత్ లో చౌకైన స్మార్ట్ ఫోన్ Nokia G11 Plus ని లాంచ్ చేసింది. Nokia G11 Plus ధరను రూ.12,499 గా నిర్ణయించారు. Nokia G11 Plus 50ఎంపి కెమెరా, 90 హెర్ట్జ్ డిస్ప్లే, 4జిబి ర్యామ్ వంటి స్పెసిఫికేషన్స్ తో మార్కెట్ లోకి వచ్చింది. మరి Nokia G11 Plus యొక్క ధర, సేల్, ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ కి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి.

Nokia G11 Plus ధర

Nokia G11 Plus స్మార్ట్ ఫోన్ సింగిల్ వేరియంట్ లో భారత గడ్డపై అడుగు పెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీతో వస్తోంది. Nokia G11 Plus ధరను భారత్ లో రూ.12,499 గా నిర్ణయించారు. లేక్ బ్లూ, చార్‌కోల్ గ్రే కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

Nokia G11 Plus స్పెసిఫికేషన్స్

Nokia G11 Plus స్మార్ట్ ఫోన్, 6.51-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 720*1600 పిక్సెల్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంది. ఈ ఫోన్ పాలికార్బొనేట్ బాడీని కలిగి ఉంది. Nokia G11 Plus 164.8 మిల్లీ మీటర్ల పొడవు, 75.9 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.55 మిల్లీ మీటర్ల మందం, 192 గ్రాముల బరువు ఉంటుంది.

Nokia G11 Plus ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 2 ఓఎస్ అప్డేట్స్ ప్రామిస్ తో వస్తోంది. అంటే ఈ నోకియా ఫోన్ అతి త్వరలో ఆండ్రాయిడ్ 13 అప్డేట్ పొందనుందన్న మాట. ఈ ఫోన్లో యూనిసాక్ టీ606 చిప్సెట్ అమర్చారు. Nokia G11 Plus లో 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 512జిబి వరకు పెంచుకోవచ్చు.

ఇప్పుడు Nokia G11 Plus స్మార్ట్ ఫోన్ యొక్క కెమెరా విభాగం ఎలా ఉందో చూద్దాం. ఈ ఫోన్లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఇవ్వడం జరిగింది. అలాగే 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ కూడా ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందు వైపున 8 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు.

Nokia G11 Plus డ్యూయల్ సిమ్ స్మార్ట్ ఫోన్. 4జీ వోల్టీ పై పని చేస్తుంది. Nokia G11 Plus లో 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ, వై-ఫై, బ్లూటూత్ వంటి బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ ఐపీ52 రేటింగ్ తో వస్తోంది. Nokia G11 Plus లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.