Home News 4GB ర్యామ్, UniSoc T606 చిప్సెట్‌తో వస్తోన్న Nokia G22

4GB ర్యామ్, UniSoc T606 చిప్సెట్‌తో వస్తోన్న Nokia G22

Highlights
  • ఆక్టాకోర్ 1.8 గిగాహెర్ట్జ్ UniSoc T606 ప్రాసెసర్ తో వస్తోన్న Nokia G22
  • ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేయనున్న Nokia G22 స్మార్ట్ ఫోన్
  • 6.5-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోన్న Nokia G22 డివైజ్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నోకియా త్వరలోనే జీ-సిరీస్ లో Nokia G22 అనే కొత్త ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ డివైజ్ బెంచ్ మార్కింగ్ సైట్ Geekbench పై కనిపించింది. త్వరలో లాంచ్ కాబోయే Nokia G22 ఫోన్ 4జిబి ర్యామ్, యూనిసాక్ ప్రాసెసర్ తో లాంచ్ కానుందని సమాచారం.

Nokia G22 స్మార్ట్ ఫోన్ గతేడాది లాంచైన Nokia G21 కి సక్సెసర్ గా వస్తోంది. ఇక Nokia G21 డివైజ్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, రూ.12,999 ధరతో లాంచైంది. ఇక రాబోవు Nokia G22 స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా బయటకు వచ్చాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.

Nokia G22 గీక్‌బెంచ్ స్కోర్

Nokia G22 స్మార్ట్ ఫోన్ సింగిల్ కోర్ టెస్ట్ లో 308 పాయింట్లు నమోదు చేసింది. మల్టీ-కోర్ టెస్ట్ లో 1094 పాయింట్లు సాధించింది. స్పెసిఫికేషన్స్ ని బట్టి చూస్తే, ఈ రేటింగ్స్ లో-కాస్ట్ స్మార్ట్ ఫోన్ కి మంచివేనని చెప్పవచ్చు.

Nokia G22 స్పెసిఫికేషన్స్

Nokia G22 స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా పూర్తిగా తెలియవు. అయితే గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా MySmartPrice వెబ్ సైట్ Nokia G22 యొక్క స్పెసిఫికేషన్స్ ని తన కథనంలో ప్రచురించింది. ఆ రిపోర్ట్ ప్రకారం, Nokia G22 డివైజ్ ఆక్టాకోర్ 1.8 గిగాహెర్ట్జ్ UniSoc T606 ప్రాసెసర్, మాలి-జీ57 జీపీయూ ని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్ తో వస్తోంది. సాఫ్ట్ వేర్ విషయానికి వస్తే, Nokia G22 డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత స్టాక్ ఆండ్రాయిడ్ యూఐ పై పని చేస్తుంది.

ఇదిలా ఉండగా, గతేడాది లాంచైన Nokia G21 స్మార్ట్ ఫోన్ 6.5-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చింది. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 2ఎంపి డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

Nokia G22 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5,050 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉంటుంది. ఈ ఫోన్ లో భద్రత కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.