
ఎన్నో లీకులు, రూమర్ల తర్వాత ఎట్టకేలకు హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ Nokia G42 5G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ 6.56-ఇంచ్ హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ని రిపెయిరబులిటీ పై ఫోకస్ చేస్తూ తీసుకొచ్చారు. ఇది హెచ్ఎండీ నుంచి వచ్చిన తొలి యూజర్ రిపెయిరబుల్ 5జీ ఫోన్.
Nokia G42 5G స్మార్ట్ ఫోన్ 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 8ఎంపి ఫ్రంట్ కెమెరా, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వచ్చింది. ఓసారి Nokia G42 5G డివైజ్ ధర, స్పెసిఫికేషన్స్, లభ్యత గురించి తెలుసుకుందాం.
Nokia G42 5G ధర, లభ్యత
Nokia G42 5G స్మార్ట్ ఫోన్ పర్పుల్ మరియు గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. Nokia G42 5G డివైజ్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర 199 డాలర్లు (సుమారు రూ.16,300) గా ఉంటుంది. 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ కూడా ఉంది. అయితే హెచ్ఎండీ గ్లోబల్ ఈ బేస్ వేరియంట్ ధరను ఇంకా రివీల్ చేయలేదు. ప్రస్తుతం ఈ ఫోన్ యూఎస్, యూకే మరియు యూరప్ మార్కెట్స్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంది.
Nokia G42 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Nokia G42 5G లో 6.56-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, హెచ్డీ+ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 450 నిట్స్ బ్రైట్నెస్, 20:9 యాస్పెక్ట్ రేషియో, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఉంటాయి.
- ప్రాసెసర్: Nokia G42 5G డివైజ్ లో ఆక్టా-కోర్ స్నాప్ డ్రాగన్ 480+ చిప్సెట్, అడ్రెనో 619 జీపీయూ ఉంటాయి.
- ర్యామ్, స్టోరేజీ: Nokia G42 5G స్మార్ట్ ఫోన్ 4జిబి/6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.
- కెమెరా: Nokia G42 5G స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- ఇతర ఫీచర్లు: Nokia G42 5G డివైజ్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ52 రేటింగ్ ఉన్నాయి.
- కనెక్టివిటీ: Nokia G42 5G లో డ్యూయల్-సిమ్ కార్డ్ స్లాట్, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్/ఏజీపీఎస్, గ్లొనాస్, బీడీఎస్, గెలీలియో, డ్యూయల్ 4జీ వొల్టీ, 5జీ (n1, n2, n3, n5, n7, n28, n40, n41, n66, n77, n78), యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.
- బ్యాటరీ: Nokia G42 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 20 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.











