స్మార్ట్ఫోన్ మేకర్ 5జీ ఫోన్లతో భారతీయ వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో, సదరు సంస్థ Nokia G42 5G డివైజ్ ని భారతీయ మార్కెట్ లోకి తీసుకొచ్చింది. సెప్టెంబర్ 11 న Nokia G42 5G ఫోన్ ధరను రివీల్ చేయనున్నట్లు నోకియా తెలిపింది. ఇప్పుడు ఈ సంస్థ ఫోన్ యొక్క ధర శ్రేణిని తన సోషల్ మీడియా హ్యాండిల్స్ పై టీజ్ చేసింది. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
The Nokia G42 5G has a Snapdragon 480+ 5G chipset, 50MP triple rear AI camera, and 11GB RAM. Guess what’s the price.#MoveFast #StayTuned #NokiaG42_5G #Nokiaphones #Nokiasmartphones
— Nokia Mobile India (@NokiamobileIN) September 7, 2023
Nokia G42 5G ధర శ్రేణి
- సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై నోకియా సంస్థ Nokia G42 5G డివైజ్ ధర యొక్క పోల్ ని మొదలుపెట్టింది.
- Nokia G42 5G ధర రూ.16xxx లేదా రూ.18xxx మధ్య ఉంటుందని తన పోస్ట్ లో కంపెనీ తెలిపింది.
- యూజర్లు పోల్ ద్వారా Nokia G42 5G ధర రూ.16xxx వద్ద ఉంటుందని అభిప్రాయపడ్డారు.
- 81 శాతం మంది యూజర్లు రూ.16xxx రేంజ్ లో ధర ఉండవచ్చని అంచనా వేశారు.
- Nokia G42 5G యొక్క టాప్ మోడల్ 6జిబి ర్యామ్ ని ఆఫర్ చేయగా, బేస్ వేరియంట్ 4జిబి ర్యామ్ ని ఆఫర్ చేస్తుంది.
- Nokia G42 5G ఫోన్ లో 5జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉంది. దీంతో యూజర్ కి 11జిబి వరకు ర్యామ్ లభిస్తుంది.
Nokia G42 5G స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Nokia G42 5G డివైజ్ అమెజాన్ మైక్రోసైట్ లో స్పెసిఫికేషన్స్ తో లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ లో 6.56-ఇంచ్ వాటర్ డ్రాప్ నాచ్, హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Nokia G42 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 480+ చిప్సెట్ ఉంది. ఇది 2.2 గిగాహెర్ట్జ్ హై-క్లాక్ స్పీడ్ కలిగి ఉంది.
- స్టోరేజీ: Nokia G42 5G డివైజ్ లో 128జిబి స్టోరేజీ, 6జిబి ర్యామ్, 5జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉన్నాయి.
- కెమెరా: Nokia G42 5G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో, డెప్త్ సెన్సర్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Nokia G42 5G స్మార్ట్ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 20 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Nokia G42 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. రెండేళ్ళ ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళపాటు సెక్యూరిటీ అప్డేట్స్ ని కంపెనీ ప్రామిస్ చేస్తోంది.
- కనెక్టివిటీ: Nokia G42 5G లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
