8,200mAh బ్యాటరీ, 10.36-inch డిస్ప్లేతో భారత్‌లో లాంచైన Nokia T21 ట్యాబ్లెట్

Highlights

  • వై-ఫై మరియు ఎల్టీఈ + వై-ఫై వేరియంట్స్ లో భారత్ లో లాంచైన Nokia T21
  • 10.36-ఇంచ్ డిస్ప్లే, 2కే రెజుల్యూషన్ తో లాంచైన Nokia T21 ట్యాబ్లెట్
  • 2 ఏళ్ల పాటు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ని హామీ ఇస్తోన్న Nokia

హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ భారత్ లో Nokia T21 ట్యాబ్లెట్ ని లాంచ్ చేసింది. ఇది మిడ్ రేంజ్ ట్యాబ్లెట్. Nokia T21 ధరను భారత్ లో రూ.17,999 గా నిర్ణయించారు. Nokia T21 లో 10.36-ఇంచ్ భారీ డిస్ప్లే, 4జిబి ర్యామ్, 8200 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచైంది. Nokia T21 ధర, స్పెసిఫికేషన్స్ ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.

Nokia T21 ధర

భారత్ లో Nokia T21 ట్యాబ్లెట్ వై-ఫై, ఎల్టీఈ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. రెండు మోడల్స్ కూడా 64జిబి స్టోరేజీ 4జిబి ర్యామ్ తో వచ్చాయి. ధర గురించి మాట్లాడితే, వై-ఫై వేరియంట్ ధరను రూ.17,999 గా నిర్ణయించారు. ఇక ఎల్టీఈ+వై-ఫై వేరియంట్ ధర రూ.18,999 గా ఉంది. Nokia T21 ట్యాబ్లెట్ చార్‌కోల్ గ్రే కలర్ ఆప్షన్ లో అందుబాటులో ఉంది. జనవరి 22 నుంచి ఈ ట్యాబ్లెట్ సేల్స్ మొదలవుతాయి.

Nokia T21 స్పెసిఫికేషన్స్

  • యూనిసాక్ టీ612 ప్రాసెసర్
  • 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ
  • 10.36 ఇంచ్ 2కే ఎల్సీడీ డిస్ప్లే
  • 8ఎంపి రియర్ + 8ఎంపి సెల్ఫీ కెమెరాలు
  • 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
  • 8,200 ఎంఏహెచ్ బ్యాటరీ

Nokia T21 లో 5:3 యాస్పెక్ట్ రేషియోని అందించారు. ఈ ట్యాబ్లెట్ లో 10.36-ఇంచ్ 2కే డిస్ప్లే, 1200*2000 పిక్సెల్ రెజుల్యూషన్, ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, 400 నిట్స్ బ్రైట్నెస్ అందించారు. Nokia T21 లో ఐపీ52 డస్ట్ అండ్ వాటర్ రెస్టిస్టన్స్ రేటింగ్ ఉండటం విశేషం.

Nokia T21 ట్యాబ్లెట్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది. ఈ ట్యాబ్లెట్ లో యూనిసాక్ టీ612 ఆక్టాకోర్ ప్రాసెసర్ ని వాడారు. ఈ చిప్ 1.82 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 జీపీయూ వినియోగించారు. Nokia T21 ట్యాబ్లెట్ 2 ఏళ్ళ మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ మరియు 3 ఏళ్ళ సెక్యూరిటీ అప్డేట్స్ తో వస్తోంది.

ఇప్పుడు Nokia T21 యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ట్యాబ్లెట్ లో 8ఎంపి ప్రైమరీ రియర్ కెమెరా అందించారు. అలాగే దీనికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. పవర్ బ్యాకప్ కోసం ఈ ట్యాబ్లెట్ లో 8,200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 3.5ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎం రేడియో, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ట్యాబ్లెట్ లో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleUniSoc ప్రాసెసర్, 3000mAh బ్యాటరీతో లాంచైన Nokia C12
Next articleరూ.349, రూ.899 రీచార్జ్ ప్లాన్స్‌ని లాంచ్ చేసిన Jio
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.