Nokia XR21 లిమిటెడ్ ఎడిషన్‌ని లాంచ్ చేసిన HMD Global; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి!

Highlights

  • యూరప్ లో లాంచైన Nokia XR21 లిమిటెడ్ ఎడిషన్
  • ఐపీ69కే సర్టిఫికేషన్, ఐపీ68 రేటింగ్ తో వచ్చిన డివైజ్
  • ఫ్రాస్టెడ్ ప్లాటినమ్ కలర్‌లో లభించనున్న Nokia XR21

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nokia యూరోపియన్ మార్కెట్ లో Nokia XR21 లిమిటెడ్ ఎడిషన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఎంతో దృఢమైందని కంపెనీ చెబుతోంది. ఫ్రాస్టెడ్ ప్లాటినమ్ కలర్ ఆప్షన్ లో ఈ ఫోన్ ని కంపెనీ లాంచ్ చేసింది. ఇతర మార్కెట్స్ లోకి Nokia XR21 డివైజ్ యొక్క లిమిటెడ్ ఎడిషన్ ఎంట్రీ ఇస్తుందో లేదో ఇంకా తెలియదు. ఓసారి Nokia XR21 పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Nokia XR21 లిమిటెడ్ ఎడిషన్ ఫీచర్స్

  • Nokia XR21 లిమిటెడ్ ఎడిషన్ ప్రత్యేకతలు తెలుసుకుందాం. ఈ ఫోన్ MIL-STD-810H లెవెల్ డ్యూరబులిటీ, ఐపీ69కే సర్టిఫికేషన్ తో వచ్చింది. దీంతో ఈ ఫోన్ దృఢత్వంలో మేటిగా నిలుస్తోంది.
  • HMD గ్లోబల్ సంస్థ 50 Nokia XR21 లిమిటెడ్ ఎడిషన్ ఫోన్లను మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో కేవలం 30 యూనిట్లు మాత్రమే సేల్ కి అందుబాటులో ఉంటాయి.
  • ఈ డివైజ్ కి స్పెషల్ సీరియల్ నంబర్ ఇచ్చారు. ఇంకా లిమిటెడ్ ఎడిషన్ బాక్స్ లో ప్రత్యేకమైన ఫ్రాస్టెడ్ ప్లాటినమ్ కలర్ లో ఈ ఫోన్ వస్తుంది.

Nokia XR21 లిమిటెడ్ ఎడిషన్ స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Nokia XR21 లిమిటెడ్ ఎడిషన్ లో 6.49-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 550 నిట్స్ పీక్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Nokia XR21 లిమిటెడ్ ఎడిషన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్ వాడారు.
  • మెమొరీ: Nokia XR21 లిమిటెడ్ ఎడిషన్ డివైజ్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్ లో లభిస్తుంది.
  • కెమెరా: Nokia XR21 లిమిటెడ్ ఎడిషన్ లో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Nokia XR21 లిమిటెడ్ ఎడిషన్ పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Nokia XR21 లిమిటెడ్ ఎడిషన్ డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది.

Nokia XR21 లిమిటెడ్ ఎడిషన్ ధర

Nokia XR21 లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ ధర యూరోపియన్ మార్కెట్స్ లో 699 యూరోలు (సుమారు రూ.60,000) గా నిర్ణయించారు.

Previous article80W చార్జింగ్, 12GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన Vivo V29 Pro
Next articleAndroid 14 OS తో భారత్‌లో లాంచైన Google Pixel 8, Pixel 8 Pro
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.