Home News Nothing Phone (1) కెమెరా స్పెసిఫికేషన్స్, శాంపిల్స్

Nothing Phone (1) కెమెరా స్పెసిఫికేషన్స్, శాంపిల్స్

హైలైట్స్:

* నథింగ్ నుంచి వస్తున్న తొలి స్మార్ట్ ఫోన్, Nothing Phone (1) 2022, జులై 12 న లాంచ్ అవుతోంది.

* లాంచ్ కి ముందు కెమెరా యొక్క కీలక స్పెసిఫికేషన్స్ ని కంపెనీ కన్ఫర్మ్ చేసింది.

* Nothing Phone (1) యొక్క కెమెరా శాంపిల్స్ ని కంపెనీ ప్రదర్శించింది.

జులై 12 న నథింగ్ కంపెనీ తన తొలి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ Nothing Phone (1) ని లాంచ్ చేస్తోంది. ఇప్పటి వరకు డివైజ్ కి సంబంధించిన ఎన్నో లీక్స్, రూమర్లు బయటకు వచ్చాయి. వాటిని బట్టి, మనం వేటిని ఆశించవచ్చనే అంచనాకు వచ్చాం. ఇక ఫోన్ పై మరింత హైప్ పెంచేందుకు నథింగ్ కంపెనీ ఏ మార్గాన్ని వదలడం లేదు. వరుసగా ఫోన్ కి సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్స్, ఫీచర్లు, డిజైన్ ను టీజ్ చేస్తూ వస్తోంది. తాజాగా, రేపు లాంచ్ ఉందనగా, నథింగ్ కంపెనీ, కెమెరా శాంపిల్స్ ని రిలీజ్ చేసింది. మరి ఓ లుక్ వేద్దాం రండి.

Nothing Phone (1) కెమెరా శాంపిల్స్, స్పెసిఫికేషన్స్

పైన పిక్స్ లో చూస్తున్న విధంగా, నథింగ్ ఫోన్ (1) పలు పరిస్థితుల్లో బాగా పెర్ఫామ్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. విభిన్న సందర్భాలు, లైటింగ్ కండిషన్స్ లో నథింగ్ ఫోన్ (1) చక్కటి ఫోటోలను తీసింది. అయితే ఒక అంచనాకు వచ్చే ముందు కాస్త వేచి చూడటం సబబు. ఎందుకంటే, బెస్ట్ పిక్స్ ని మాత్రమే బ్రాండ్స్ షోకేజ్ చేయడం సహజం. ఇప్పటికైతే, కెమెరా విభాగం ప్రామిసింగ్ గా కనిపిస్తోంది.

నథింగ్ ఫోన్ (1) లో రెండు రియర్ కెమెరాలున్నాయి. మొదటిది 50ఎంపి సోనీ ఐఎంఎక్స్766 మెయిన్ కెమెరా (f/1.88 అపర్చర్, 1/1.56″ సెన్సర్ సైజ్) కాగా, రెండోది 114-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కలిగిన 50 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. ఈ కెమెరా 10-బిట్ కలర్ వీడియోలను షూట్ చేయగలిగే కెపాసిటీ కలిగి ఉంది. అలాగే, ఓఐఎస్, ఈఐఎస్ కూడా ఉన్నాయి. ఇక ముందు 16ఎంపి కెమెరా ఉంది. ఇంకా నథింగ్ ఫోన్ (1) లో నైట్ మోడ్, సీన్ డిటెక్షన్ వంటి ఫీచర్లున్నాయి.

Nothing Phone (1) స్పెసిఫికేషన్స్ (అంచనా)

నథింగ్ ఫోన్ (1) లో 6.55 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి+ ప్రాసెసర్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, నథింగ్ ఓఎస్ స్కిన్, 50ఎంపి+16ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా, 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లున్నాయి.