హైలైట్స్:
- ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022 లో నథింగ్ ఫోన్ (1) పై భారీ డిస్కౌంట్ ఆఫర్
- గూగుల్ పిక్సెల్ 6ఏ పై కూడా భారీ డిస్కౌంట్
- ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో రూ.28,999 కి లభించనున్న Nothing Phone (1)

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ సేల్ 2022 త్వరలో మొదలు కానుంది. ఇప్పటికే కంపెనీ సేల్ కి సంబంధించిన పలు ఆసక్తికర టీజర్ లను బయటకు వదులుతోంది. దీంతో ఈసారి సేల్ పై అందరిలోనూ అంచనాలు పెరిగిపోయాయి. ఒక టీజర్ లో Nothing Phone (1), Google Pixel 6a పై భారీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు కనిపించింది. నథింగ్ కంపెనీ రీసెంట్ గా Nothing Phone (1) ధరను పెంచిన సంగతి తెలిసిందే. అయితే, ఫ్లిప్ కార్ట్ సేల్ సందర్భంగా ఈ ఫోన్ డిస్కౌంట్ ధరకు లభించనుంది. మరోవైపు గూగుల్ పిక్సెల్ 6ఏ పై కూడా భారీ డిస్కౌంట్ ఉన్నట్లు స్పష్టమవుతోంది. అయితే అసలు డీల్ ఏంటో ఇంకా రివీల్ కావాల్సి ఉంది.
ప్రముఖ టిప్ స్టర్ ముకుల్ శర్మ ఈ డీల్ కి సంబంధించిన టీజర్ ను ట్విట్టర్ లో షేర్ చేశాడు. Nothing Phone (1) ని తక్కువ ధరకు సొంతం చేసుకోవాలనుకునే వారికి ఈ సేల్ టైమ్ ఎంతో ముఖ్యమైంది. కాబట్టి, వెంటనే సేల్ ప్రారంభమవ్వగానే ఆర్డర్ పెట్టేయండి. అలాగే గూగుల్ పిక్సెల్ 6ఏ పై కూడా డిస్కౌంట్ ఉందనే విషయం గమనించండి. ఆసక్తి ఉంటే ఓసారి ఈ ఫోన్ పై కూడా ఓ కన్నేయండి.
Nothing Phone (1) ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్, ధర
?#flipkart #bigbilliondays2022 pic.twitter.com/7F0IveNxdk
— Mukul Sharma (@stufflistings) September 9, 2022
Nothing Phone (1) 8జిబి + 128జిబి వేరియంట్ ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో రూ.33,999 వద్ద అమ్ముడవుతోంది. అయితే, తాజా టీజర్ ద్వారా తెలుస్తున్నదేంటంటే, సేల్ సందర్భంగా Nothing Phone (1) రూ.28,999 కే లభించనుంది. అంటే Nothing Phone (1) పై మీకు రూ.5,000 డిస్కౌంట్ లభిస్తోంది. ఈ డిస్కౌంట్ బ్యాంక్ ఆఫర్స్ ద్వారా లభించనుంది. అయితే, ఏయే బ్యాంక్స్ అనే విషయం ఇంకా వెల్లడించలేదు.
Nothing Phone (1) స్పెసిఫికేషన్స్
Nothing Phone (1) లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి+ చిప్ అమర్చారు. ఈ ఫోన్ 12జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీని కలిగి ఉంది. Nothing Phone (1) 6.55 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే ని కలిగి ఉంది. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. Nothing Phone (1) లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది.
ఇప్పుడు Nothing Phone (1) కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Nothing Phone (1) లో రెండు 50 ఎంపి రియర్ కెమెరాలు ఉన్నాయి. వీటిలో ఒకటి 50ఎంపి మెయిన్ సెన్సర్ కాగా, రెండోది 50ఎంపి అల్ట్రా-వైడ్ లెన్స్. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి కెమెరాను అమర్చారు. Nothing Phone (1) ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత నథింగ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్, ఎంటర్టెయిన్మెంట్ వార్తల కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.











