గమనించాల్సినవి:
* వివాదం కేవలం ఫేక్ లెటర్ కు సంబంధించినది మాత్రమే కాదు. ఫేక్ లెటర్ సమర్థనీయం కాదు. దీనిపై యూట్యూబర్ ప్రసాద్ కూడా తన వివరణ ఇవ్వడం జరిగింది.
* తమకు తెలిసిన భాషలో ఫోన్ కి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలనుకోవడం తప్పు కాదు. అదే విధంగా టెక్ కంపెనీలకు కూడా తమ సొంత స్ట్రేటజీలుంటాయి. వాటిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నథింగ్ కంపెనీని పూర్తిగా తప్పుబట్టలేం. దాంతో పాటు టెక్ యూట్యూబర్లు, యూజర్ల వాదనను కూడా పరిగణలోకి తీసుకోవాలి.
* హిందీ, ఇంగ్లీషు తో పాటు మిగతా ముఖ్యమైన భాషలకు కూడా సమానంగా ప్రాధాన్యతనివ్వాలి.

ఏ కొత్త ఫోన్ అయినా, లాంచ్ కు ముందే దాని అన్ బాక్సింగ్ వీడియో చూడాలని ప్రతీ వినియోగదారుడు కోరుకుంటాడు. వారి కోరికను తీర్చేది మన టెక్ యూట్యూబర్లే. ఇక వారికి రివ్యూ యూనిట్స్ ని పంపాల్సిన బాధ్యత టెక్ కంపెనీలదే. ప్రోడక్ట్ ని మరింతగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు సహకరించే టెక్ యూట్యూబర్ల కష్టాన్ని ఇక్కడ గుర్తించాలి. తమకు నచ్చిన విధంగా నడుచుకునే స్వేచ్ఛ ప్రతి కంపెనీకి ఉంటుంది. కానీ, మనుగడలో ఉండాలంటే, అందరినీ సమానంగా చూడాలి.
తమిళనాడులో ఫోన్ తయారవుతుంది కానీ, తమిళ భాషా టెక్ యూట్యూబర్ కి లాంచ్ కి ముందు రివ్యూ యూనిట్ వెళ్ళదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ భాషల ఆధారంగా ఎవ్వరు కూడా దేశాన్ని విడదీయడం లేదు. కానీ సమానంగా చూడమని కోరుతున్నారు. హిందీ, ఇంగ్లీషు టెక్ యూట్యూబర్లకు రివ్యూ యూనిట్లు ఇచ్చిన విధంగా, ప్రాంతీయ భాషా టెక్ యూట్యూబర్లకు తలా ఒకటి చొప్పున రివ్యూ యూనిట్లు ఇస్తే బాగుండేదని Nothing Phone (1) ఫ్యాన్స్ అంటున్నారు.
— Manu Sharma (@buildingnothing) July 13, 2022
వ్యతిరేకతపై స్పందించిన Nothing India వైస్ ప్రెసిడెంట్ మను శర్మ
విడతల వారిగా రివ్యూ యూనిట్లను ప్రాంతీయ భాషా టెక్ యూట్యూబర్లకు కూడా ఇస్తామని చెబుతూ నథింగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఓ వివరణ ఇచ్చారు. కానీ ఇక్కడ గమనించాల్సిందొకటుంది. అదేంటంటే, ప్రాంతీయ భాషలకు చెందిన వినియోగదారులు కూడా లాంచ్ కు ముందే ఫోన్ అన్ బాక్సింగ్ చూడాలనుకుంటారు కదా? మరి అలాంటప్పుడు ముందే రివ్యూ యూనిట్లు ఆయా భాషా టెక్ యూట్యూబర్లకు పంపిస్తే తప్పేంటి?
ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఉత్తరాది, దక్షిణాది అని ఎవ్వరు కూడా వేరు చేయడం లేదు. కానీ, ప్రాంతీయ భాష ఏదైనా సరే, అది గుజరాతీ అయినా, పంజాబీ అయినా, మలయాళం అయినా, తెలుగు, తమిళ, కన్నడ భాషలైనా, ఒరియా, రాజస్తానీ, అస్సామీ, మరాఠి, బెంగాలీ అయినా.. భాష ఏదైనా సరే తలా ఒకటి చొప్పున రివ్యూ యూనిట్ లాంచ్ కి ముందే పంపితే అందరూ సంతోషించే వారు. అసలు ఈ గొడవ ఉండేది కాదు.
ఫేక్ లెటర్ పై యూట్యూబర్ ప్రసాద్ వివరణ
ఫేక్ లెటర్ కి సంబంధించి స్పందించిన యూట్యూబర్ ప్రసాద్ (PrasadTechInTelugu), అది అఫీషియల్ లెటర్ కాదని, రిప్రజెంటేషన్ కోసం వాడుకున్నది మాత్రమేనని వివరణ ఇచ్చాడు. ఇక్కడ ఫేక్ లెటర్ విషయాన్ని భూతద్దంలో చూపి అతడిని తప్పు పట్టడం కంటే, అతడు లేవనెత్తిన ‘సమానత్వం’ అనే పాయింట్ ని అందరు గ్రహించాలి. Nothing కంపెనీ ప్లాన్ వేరేదై ఉండొచ్చు. ఇక్కడ ఆ కంపెనీని కూడా పెద్దగా తప్పుబట్టలేం. కానీ, మార్కెట్ లో నిలబడాలంటే, అన్ని భాషల్లో తమ ప్రోడక్ట్ కి సంబంధించిన ప్రచారం చేపట్టడం కచ్చితంగా అవసరం. అందుకోసం ఇకపై వారు తమ ఉత్పత్తుల యొక్క రివ్యూ యూనిట్లను లాంచ్ కి ముందే, హిందీ, ఇంగ్లీషు భాషా టెక్ యూట్యూబర్లకు పంపినట్లుగానే, ప్రాంతీయ భాషా టెక్ యూట్యూబర్లకు కూడా పంపడం మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఏళ్ళుగా ఎన్నో టెక్ కంపెనీలను ఆదరిస్తోన్న భారతీయులు Nothing కంపెనీని కూడా ఆదరిస్తారనడంలో సందేహమక్కర్లేదు. కానీ, ఇలా కొత్తగా మార్కెట్ లోకి అడుగుపెడుతున్నప్పుడు అందరికీ చేరువవ్వాలని చూడాలి గానీ, రివ్యూ యూనిట్లను పంపకుండా వివాదంలో చిక్కుకోవడం సరికాదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రాంతీయ భాషలు మాట్లాడే వారు కూడా నథింగ్ ఫోన్ (1) ని ప్రీ-ఆర్డర్ చేసుకున్నారు కదా? మరి అలాంటప్పుడు, వారికి తమ తమ భాషలో లాంచ్ కి ముందు ఫోన్ అన్ బాక్సింగ్ వీడియో చూసే హక్కు లేదా? ఈ విషయాలను నథింగ్ కంపెనీ పరిగణలోకి తీసుకోవాలని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికి ఈ వివాదం సమసిపోయిందని అనుకోవడం తేలికే. కానీ భవిష్యత్తులో ఇలాంటివి తలెత్తకుండా ఉండాలంటే, ఏం చేయాలనే దానిపై దృష్టి పెట్టాలి.












