హైలైట్స్:
- Nothing Phone (1) కి నతింగ్ ఓఎస్ 1.1.4 అప్డేట్ రిలీజ్ చేసిన నతింగ్ కంపెనీ
- తాజా అప్డేట్ తో మెరుగైన కెమెరా పనితనం
- ఈ ఏడాది చివరికల్లా ఆండ్రాయిడ్ 13 బీటా వర్షన్ ని రోలౌట్ చేయనున్న నతింగ్
రూ.30,000 లోపు ధరలో ఉన్న రికమెండ్ చేయదగిన ఉత్తమ ఫోన్లలో Nothing Phone (1) కచ్చితంగా ఉంటుంది. ప్రత్యేకించి ఫ్లిప్ కార్ట్ సేల్ సందర్భంగా ఈ ఫోన్ పై మంచి డిస్కౌంట్స్ కూడా వస్తున్నాయి. అయితే Nothing Phone (1) కి ఆదిలోనే ఎన్నో సమస్యలు ఎదురయిన సంగతి తెలిసిందే. దీంతో కంపెనీ, సమయానుగుణంగా అప్డేట్స్ ని పంపుతూ వాటిని సరిచేసే పనిలో పడింది. తాజాగా నతింగ్ ఓఎస్ వర్షన్ 1.1.4 అప్డేట్ ని రోలౌట్ చేసింది. జులై లో ఫోన్ లాంచ్ అయిన నాటి నుంచి చూస్తే, ఇప్పుడు వచ్చిన అప్డేట్ వరుసగా నాల్గవది.
Nothing OS 1.1.4 అప్డేట్ ముఖ్యమైన ఆప్టిమైజేషన్స్ ని అందించనుంది. ప్రత్యేకించి 50ఎంపి డ్యూయల్ కెమెరాల పనితీరుని ఈ అప్డేట్ మెరుగు పరచనుంది. ఒకసారి గమనిస్తే, గత అప్డేట్ అయిన Nothing OS 1.1.3 సాఫ్ట్‌వేర్ ని ఫైన్ ట్యూన్ చేసింది. దీంతో షార్ప్ క్లారిటీ, కలర్ ఫెడిలిటీ మెరుగయ్యాయి. ఇక ఈ ఏడాది చివరి కల్లా Android 13 బీటా వర్షన్ ని రోలౌట్ చేస్తమాని నతింగ్ ప్రకటించింది.
Nothing Phone (1) అప్డేట్
Nothing OS 1.1.4 అప్డేట్ ‘నతింగ్-తీమ్డ్’ వాటర్ మార్క్ ని కెమెరా యాప్ కి యాడ్ చేసింది. అలాగే అల్ట్రావైడ్ కెమెరా కలర్ క్యాలిబ్రేషన్ మెరుగుపరిచింది. అలాగే మెయిన్ కెమెరాకు అల్ట్రావైడ్ సెన్సర్ కి మధ్య కలర్ కన్సిస్టెన్సీని పెంచింది. కదులుతున్న ఆబ్జెక్స్ ని షూట్ చేసేప్పుడు స్టెబిలిటీని ఇంప్రూవ్ చేయడం కోసం కొత్త మోషన్ డిటెక్షన్ అల్గారిథమ్ ని యాడ్ చేసింది.
అల్ట్రా వైడ్ మోడ్ లో హెచ్డీఆర్ ని వాడుతున్నప్పుడు షూటింగ్ స్పీడ్ ని తాజా అప్డేట్ పెంచేసింది. ఇప్పుడు నైట్ మోడల్ షాట్స్ కలర్ ఆక్యురసీ పెరిగి లైవ్లీ గా కనిపిస్తున్నాయి. 3-బటన్ నేవిగేషన్ బార్ ని ఫ్లిప్ చేసేందుకు కొత్త ఆప్షన్ తో పాటు, ఎల్‌హెచ్డీసీ హై-డెఫినిషన్ ఆడియో సపోర్ట్ ని ఈ నయా అప్డేట్ తీసుకొచ్చింది.
కెమెరా ఇంప్రూవ్మెంట్స్ తో పాటు నతింగ్ లేటెస్ట్ ఓఎస్ అప్డేట్ సెప్టెంబర్ సెక్యూరిటీ ప్యాచ్ ని తీసుకొచ్చింది. ఇంకా బ్యాటరీ వాడకాన్ని తగ్గించడం, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, ఇతర యూస్ కేసెస్, థర్మల్ పెర్ఫామెన్స్, కొత్త యూఐ సిస్టమ్ అప్డేట్, ఇంప్రూవ్డ్ ఫేస్ అన్‌లాక్ సిస్టమ్, జనరల్ బగ్ ఫిక్సెస్ వంటివి ఈ అప్డేట్ ఫిక్స్ చేసింది.
ఈ ఏడాది చివరి కల్లా Android 13 బీటా వర్షన్ ని రోలౌట్ చేస్తామని Nothing కంపెనీ తెలిపింది. స్టేబుల్ రిలీజ్ 2023 ప్రథమార్థంలో రిలీజ్ చేస్తామని నతింగ్ వెల్లడించింది. యూజర్ ఎక్స్‌పీరియన్స్ ని మెరుగుపరిచేందుకు వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్లు నతింగ్ తెలిపింది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.