హైలైట్స్:
- భారత్ లో మరోసారి సేల్ కి వచ్చిన Nothing Phone (1), అందుబాటులో ఉన్న రంగులు: బ్లాక్, వైట్
- అందుబాటులో ఉన్న స్టోరేజీ ఆప్షన్స్: 8జిబి+128జిబి (రూ.33.999), 8జిబి+256జిబి (రూ.36,999), 12జిబి+256జిబి (రూ.39,999)
- ఫ్లిప్‌కార్ట్ ద్వారా Nothing Phone (1) ని కొనుగోలు చేసే అవకాశం

Nothing Phone (1) ఫ్లిప్ కార్ట్ లో మళ్ళీ స్టాక్ లోకి వచ్చింది. గ్లైఫ్ ఇంటర్ఫేస్ యూనిక్ బ్యాక్-డిజైన్ కలిగిన స్మార్ట్ ఫోన్ కోసం మీరు ఎదురు చూస్తున్నట్లైతే, ఫోన్ కొనేందుకు ఇదే మంచి తరుణం. భారత మార్కెట్ లో రీసెంట్ గా Nothing Phone (1) ధరను సదరు కంపెనీ పెంచేసింది. మూడేళ్ళ పాటు మేజర్ సాఫ్ట్ వేర్ అప్డేట్స్, నాలుగేళ్ళ పాటు సెక్యూరిటీ ప్యాచెస్ అందిస్తామని నథింగ్ కంపెనీ ప్రామిస్ చేసింది. సెక్యూరిటీ ప్యాచెస్ ప్రతీ రెండు నెలలకు ఒకసారి వస్తాయి. మరి భారత్ లో Nothing Phone (1) ధర ఎంత ఉంది? ఒక్కడ కొనవచ్చు? ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయా? అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. పదండి.
Nothing Phone (1) ని ఎక్కడ కొనాలి

భారత్ లో మీరు Nothing Phone (1) ని ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్స్ లో Nothing Phone (1) లభిస్తుంది. Nothing Phone (1) ని కొనాలని ఆసక్తి కనబరిచే వారికి, 8జిబి + 128జిబి, 8జిబి + 256జిబి, 12జిబి + 256జిబి వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే మీకు Nothing Phone (1) వైట్ వేరియంట్ కావాలంటే, 8జిబి + 256జిబి లేదా 12జిబి+256జిబి వేరియంట్ ని ఎంచుకోవాల్సి ఉంటుంది. బ్లాక్ మోడల్ కేవలం 8జిబి + 128జిబి వేరియంట్ లో మాత్రమే లభ్యమవుతోంది.
భారత్ లో Nothing Phone (1) యొక్క కొత్త ధర, ఆఫర్స్
ఇటీవలె నథింగ్ కంపెనీ Nothing Phone (1) యొక్క ధరను పెంచేసింది. దీంతో బయ్యర్లు ఫోన్ కోసం రూ.1000 ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. 8జిబి + 128జిబి బేస్ మోడల్ ధర రూ.33,999 గా ఉంది. 8జిబి + 256జిబి యూనిట్ ధర రూ.36,999 గా ఉంది. ఇక టాప్-ఎండ్ 12జిబి + 256జిబి మోడల్ ధర రూ.39,999 గా ఉంది.
కొనుగోలుదారులు హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్ నాన్-ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ (క్రెడిట్ కార్డ్) ద్వారా రూ.1000 డిస్కౌంట్ పొందవచ్చు. ఇక ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ (డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్స్) ద్వారా రూ.1500 డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ కలిగిన వారు Nothing Phone (1) కొనుగోలు పై 5 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఇంకా మీరు గూగుల్ నెస్ట్ హబ్ ని రూ.4,999 కి, గూగుల్ నెస్ట్ మినీ ని రూ.1999 కి సొంతం చేసుకోవచ్చు.
Nothing Phone (1) స్పెసిఫికేషన్స్
Nothing Phone (1) లో 6.55 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 50ఎంపి + 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా, 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్, స్నాప్ డ్రాగన్ 778+ 5జీ చిప్సెట్, 4500ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ ఫాస్ట్ చార్జింగ్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, 700 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఐపీ53 రేటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.












