Home News భారత్‌లో జులై 11 న లాంచ్ కానున్న Nothing Phone (2)

భారత్‌లో జులై 11 న లాంచ్ కానున్న Nothing Phone (2)

Highlights
  • స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్‌తో రానున్న Nothing Phone (2)
  • అప్‌డేటెడ్ గ్లైఫ్ ఇంటర్ఫేస్ తో వస్తోన్న డివైజ్
  • అఫీషియల్ గా రివీల్ అయిన Nothing Phone (2) లాంచ్ తేదీ

నథింగ్ సంస్థ త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ Nothing Phone (2) ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. జులై 11 న ప్రపంచ వ్యాప్తంగా Nothing Phone (2) లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఇదే తేదీన భారత్ లో కూడా Nothing Phone (2) ఎంట్రీ ఇవ్వనుంది. Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ భారత్ లో ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి వస్తుందని ఇప్పటికే నథింగ్ సంస్థ ఖరారు చేసింది. రాబోవు ఫోన్ కి సంబంధించి టీజర్స్ ని విడుదల చేస్తూ కీలకమైన స్పెసిఫికేషన్స్ ని నథింగ్ సంస్థ రివీల్ చేస్తూ వస్తోంది.

నథింగ్ సంస్థ ఇప్పటి వరకు Nothing Phone (2) డిస్ప్లే, చిప్సెట్ యూనిట్, బ్యాటరీ వివరాలను కన్ఫర్మ్ చేసింది. సెపరేట్ గా, డిజైన్ రెండర్స్ ని కూడా లీక్ చేసింది. సరే, ఓసారి Nothing Phone (2) లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం.

Nothing Phone (2) ఇండియా లాంచ్ వివరాలు

Nothing Phone (2) ఇండియా లాంచ్ ఈవెంట్ జులై 11 వ తేదీన రాత్రి 8.30 గంటలకు జరగనుంది. కంపెనీ ఈ విషయాన్ని డిజైన్ టీజర్ ద్వారా వెల్లడించింది. టీజర్ ప్రకారం, Nothing Phone (2) అప్‌డేటెడ్ గ్లైఫ్ ఇంటర్‌ఫేస్ తో రానుంది. కంపెనీ, ఎల్ఈడీ లైట్స్ డిజైన్ ని మెరుగుపరిచినట్లు తెలుస్తోంది. ఇది Nothing Phone (1) లో కనిపించిన దాని కంటే భిన్నంగా ఉంది.

Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తోంది. అలాగే 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, లెఫ్ట్ సైడ్ హోల్-పంచ్ కటౌట్, ఫ్లాట్ స్క్రీన్ ఈ ఫోన్ లో ఉంటాయి. అప్‌గ్రేడెడ్ కెమెరా యూనిట్ ఈ ఫోన్ లో ఉండనున్నట్లు సమాచారం. రా హెచ్డీఆర్, 60ఎఫ్‌పీఎస్ 4కే వీడియో ఈ ఫోన్ లో ఉండనున్నాయి. Nothing Phone (2) 4700 ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది. భారత్ లో Nothing Phone (2) ధర రూ.40,000 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Nothing Phone (2) స్పెసిఫికేషన్స్ (అంచనా)