Nothing Phone (2): ఇండియా లాంచ్ టైమ్‌‌లైన్, మోడల్ నంబర్, ప్రధాన స్పెసిఫికేషన్స్

Highlights

  • త్వరలో భారత మార్కెట్ లో లాంచ్ కానున్న Nothing Phone (2)
  • బీఐఎస్ వెబ్ సైట్ పై కనిపించిన Nothing Phone (2) బ్యాటరీ వివరాలు
  • ప్రీమియమ్ ఫ్లాగ్షిప్-గ్రేడ్ అనుభూతిని ఇవ్వనున్న Nothing Phone (2)

Nothing Phone (1) స్మార్ట్ ఫోన్ ని విజయవంతంగా లాంచ్ చేసిన తర్వాత లండన్ కి చెందిన నథింగ్ సంస్థ Nothing Phone (2) ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది Nothing Phone (2) మొబైల్ లవర్స్ ని పలకరించనుంది. MySmartPrice ద్వారా Nothing Phone (2) కి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. ఫ్లాగ్షిప్ గ్రేడ్ ప్రీమియమ్ ఎక్స్‌పీరియన్స్ ని Nothing Phone (2) అందిస్తుందని మైస్మార్ట్‌ప్రైస్ తన కథనంలో పేర్కొంది. అలాగే ఫోన్ కి సంబంధించిన లాంచ్ టైమ్ లైన్, ప్రధాన స్పెసిఫికేషన్స్, మోడల్ నంబర్ ని వెల్లడించింది.

ఇదిలా ఉండగా, ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ Nothing Phone (2) త్వరలోనే భారత్ కి రాబోతోందంటూ ట్విట్టర్ లో ఓ పోస్ట్ షేర్ చేశాడు. అలాగే Nothing Phone (2) బీఐఎస్ వెబ్ సైట్ పై కనిపించింది. దీంతో Nothing Phone (2) ఇండియా లాంచ్ కన్ఫర్మ్ అయినట్లైంది.

Nothing Phone (2) ఇండియా లాంచ్ టైమ్‌లైన్

Nothing Phone (1) భారత్ లో 2022 జులై నెలలో లాంచ్ అయ్యింది. అయితే, Nothing Phone (2) మాత్రం ప్రపంచ వ్యాప్తంగా 2023 మూడో త్రైమాసికంలో లాంచ్ కానున్నట్లు సమాచారం. ఇదే సమయంలో భారత్ లో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే, Nothing Phone (2) కి సంబంధించిన కచ్చితమైన లాంచ్ తేదీ ఇంకా తెలియదు.

Nothing Phone (2) స్పెసిఫికేషన్స్

Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ A065 అనే మోడల్ నంబర్ ని కలిగి ఉన్నట్లు MySmartPrice తెలిపింది. Nothing Phone (2) అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానుందని అంచనా వేస్తున్నారు. రిపోర్ట్ ప్రకారం, ఈ ఫోన్ అడాప్టివ్ డిస్ప్లేతో వస్తున్నట్లు తెలుస్తోంది. అంటే రిఫ్రెష్ రేట్ కంటెంట్ ని బట్టి మారిపోతుంది.

Nothing Phone (2) డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 సిరీస్ చిప్సెట్ తో రానున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో రానుంది. పవర్ బ్యాకప్ విషయానికి వస్తే, Nothing Phone (2) లో 5000mAh బ్యాటరీ ఉండనుంది.

Nothing సీఈవో కార్ల్ పెయి, యూఎస్ మార్కెట్ లో తొలుత Nothing Phone (2) లాంచ్ అవ్వనుందని హింట్ ఇచ్చారు. Nothing Phone (1) కంటే అత్యంత ప్రీమియమ్ గా Nothing Phone (2) రానుందని కార్ల్ అన్నారు. ప్రధానంగా తమ ఫోకస్ సాఫ్ట్ వేర్ విభాగంపై పెట్టినట్లు కార్ల్ చెప్పారు.

భారీ హైప్ తో వచ్చిన Nothing Phone (1) స్మార్ట్ ఫోన్ విభిన్నతను చాటింది. దాదాపు అన్ని మార్కెట్స్ లో ఈ ఫోన్ విజయం సాధించింది. అయితే ఈ ఫోన్ ఎన్నో సాఫ్ట్‌వేర్ లోపాలతో యూజర్లకు డెలివరీ అవ్వడం జరిగింది. తర్వాత ఎన్నో అప్డేట్స్ ద్వారా వాటిని సరిదిద్దారు. మొత్తానికి Nothing Phone (1) మార్కెట్ లో తన ప్రభావాన్ని చూపింది. దీంతో Nothing Phone (2) పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ ఫోన్ ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాలి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.