45W చార్జింగ్, Snapdragon 8+ Gen 1 చిప్‌తో భారత్‌లో లాంచైన Nothing Phone (2)

Highlights

  • భారత్ లో Nothing Phone (2) ప్రారంభ ధర రూ.44,999
  • రీడిజైన్డ్ గ్లైఫ్ ఇంటర్‌ఫేస్ తో వచ్చిన డివైజ్
  • జులై 21 నుంచి మొదలుకానున్న సేల్

ఎన్నో రోజుల పడిగాపుల తర్వాత Nothing Phone (2) డివైజ్ భారతగడ్డపై లాంచ్ అయ్యింది. కార్ల్ పెయ్ స్టార్టప్ Nothing నుంచి వచ్చిన రెండో ఫోన్ Nothing Phone (2). నథింగ్ ఫోన్ 1 కి సక్సెసర్ గా వచ్చిన Nothing Phone (2) డివైజ్ గ్లైఫ్ డిజైన్, ఫాస్టర్ ప్రాసెసర్, ఉత్తమమైన కెమెరాలతో వచ్చింది. ఈసారి కొత్త కలర్ ఆప్షన్ కూడా జత చేరింది. వంద శాతం రీసైక్ల్‌డ్ అల్యూమినియమ్ తో ఫోన్ తయారవ్వడం విశేషం. సరే, ఓసారి Nothing Phone (2) భారత మార్కెట్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్, సేల్ తేదీ తదితర వివరాలను తెలుసుకుందాం.

భారత్ లో Nothing Phone (2) ధర, లభ్యత

Nothing Phone (2) 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.44,999 గా నిర్ణయించారు. మరోవైపు 12జిబి + 256జిబి వేరియంట్ ధర రూ.49,999 గా ఉంది. ఇక టాప్ మోడల్ అయిన 12జిబి ర్యామ్ + 512జిబి వేరియంట్ రూ.54,999 ధర వద్ద లభ్యం కానుంది.

Nothing Phone (2) ప్రీ-ఆర్డర్ కొనుగోలుదారులు హ్యాండ్సెట్ ని జులై 20 వరకు కొనుగోలు చేయవచ్చు. నేటి రాత్రి నుంచి Ear (2) Black కూడా ప్రీ-ఆర్డర్ బయ్యర్స్ కి అందుబాటులో ఉంటుంది. ఓపెన్ సేల్ విషయానికి వస్తే, Nothing Phone (2) డివైజ్ జులై 21 వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఫ్లిప్ కార్ట్ మరియు ఎంపిక చేయబడిన రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

Nothing Phone (2) స్పెసిఫికేషన్స్

  • డిజైన్: Nothing Phone (2) డివైజ్ గత మోడల్ కంటే మెరుగైన గ్లైఫ్ ఇంటర్‌ఫేస్, ఎక్కువ ఎల్ఈడీ లైట్స్, కొత్త ఫంక్షనాలిటీస్ తో వచ్చింది. ప్రీమియమ్ ఇన్-హ్యాండ్ ఫీల్ కోసం రియర్ ప్యానెల్ కాస్త కర్వ్డ్ గా ఇచ్చారు.
  • డిస్ప్లే: Nothing Phone (2) లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Nothing Phone (2) లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Nothing Phone (2) డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 12జిబి + 256జిబి, 12జిబి + 512జిబి వేరియంట్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Nothing Phone (2) లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్/ఈఐఎస్ సెన్సర్, 50ఎంపి శాంసంగ్ జెఎన్1 అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Nothing Phone (2) లో పవర్ బ్యాకప్ కోసం 4700 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Nothing Phone (2) స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత నథింగ్ ఓఎస్ 2.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Nothing Phone (2) లో 5జీ, 4జీ, వై-ఫై 6, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ54 రేటింగ్ ఉన్నాయి.
Previous articleOLED vs AMOLED: రెండింటి మధ్య తేడా ఏంటి? ఏది బెటర్?
Next article6.64-ఇంచ్ Full HD+ డిస్ప్లే, Dimensity 6020 చిప్‌తో లాంచైన Vivo Y27 5G
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.